ముస‌ల‌వ్వ కోరిక తీర్చిన బ‌న్నీ

Update: 2015-12-15 06:00 GMT
త‌న‌కి అల్లు అర్జున్‌ ని చూడాల‌ని ఉంద‌ని చెప్పిన 67యేళ్ల ముస‌ల‌వ్వ కోరిక ఎట్ట‌కేల‌కు తీరింది. ఆమెని చూసేందుక‌ని త‌న షూటింగ్‌ ని ప‌క్క‌న‌పెట్టి మ‌రీ మంగ‌ళ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ వెళ్లాడు బ‌న్నీ.  మ‌స్తాన్‌ బీ అనే వృద్ధురాలు కొంత‌కాలంగా మూత్రాశ‌య క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతోంది. ఆమెకి అల్లు రామ‌లింగ‌య్య అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అప్ప‌ట్లో ఆయ‌న్ని నేరుగా  చూడాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింద‌ట‌. కానీ ఆ కోరిక తీర‌లేద‌ట‌. ఇంత‌లో అల్లు రామ‌లింగ‌య్య మ‌ర‌ణించారు. అప్ప‌ట్నుంచి ఆయ‌న మ‌న‌వడైన అల్లు అర్జున్‌ కి మ‌స్తాన్‌ బీ అభిమానిగా మారింద‌ట‌. ఆయ‌న డ్యాన్సుల్ని చూసి ముచ్చ‌ట‌ప‌డిపోతుంటుంద‌ట‌. అయితే ఇంత‌లో ఆమె క్యాన్స‌ర్ బారిన ప‌డి మంచానికే ప‌రిమిత‌మైంది.

అల్లు రామ‌లింగ‌య్య మ‌న‌వ‌డైన అల్లు అర్జున్‌ ని నేరుగా చూడట‌మే త‌న చివ‌రికి కోరిక అని త‌న కూతుళ్ల‌తో చెప్పింద‌ట మ‌స్తాన్‌ బీ. ఆ విష‌యం మీడియాలో వ‌చ్చింది. దీంతో అల్లు అర్జున్ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ బ‌య‌ల్దేరి వెళ్లారు. మ‌స్తాన్‌ బీని ప‌రామ‌ర్శించి ఆమెకి ధైర్యం చెప్పి వ‌చ్చాడు.  మెగా కుటుంబ క‌థానాయ‌కులు ఇలా అభిమానుల కోరిక‌ని తీర్చ‌డానికి వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి కాదు. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఒక చిన్నారి కోసం ఇదివ‌ర‌కు ఖ‌మ్మం జిల్లాకి వెళ్లిన విష‌యం తెలిసిందే. చిరంజీవి - రామ్‌ చ‌ర‌ణ్ క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతున్న ప‌లువురు చిన్నారుల ద‌గ్గ‌రికి వెళ్లి విష్ చేశారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇదివ‌ర‌కు ఓ మ‌హిళ చూడాల‌నుంద‌ని చెప్పగానే వెళ్లి ప‌రామ‌ర్శించి వ‌చ్చాడు. ఎంతైనా మ‌న తార‌లు మంచి మ‌న‌సున్న‌వాళ్లు. చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది అభిమానుల క‌ళ్ల‌ల్లో ఆనందాన్ని చూస్తున్నారు.
Tags:    

Similar News