అవసరానికి తగ్గట్టు రూపాన్ని మార్చుకోవడం.. దేహదారుడ్యాన్ని మెయింటెయిన్ చేయడం ఇవన్నీ స్టార్లకు అలవాటే. అందునా అల్లు అర్జున్ లాంటి కమిట్ మెంట్ ఉన్న హీరో తన రూపాన్ని ఊసరవెల్లిలా మార్చేయగలడు. ఆ విషయం అతడి కెరీర్ తొలి నాళ్ల నుంచి బయటపడుతూనే ఉంది. స్టార్ డైరెక్టర్లు అతడి డెడికేషన్ గురించి పదే పదే వేదికలపై పొగిడేస్తారంటే అది ప్రాక్టికల్ గా చూసిన వ్యవహారమే కాబట్టి.
మరోసారి అల్లు అర్జున్ మేకోవర్ పరిశ్రమలో వాడి వేడిగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం అతడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన ఈ చిత్రంలో కథానాయిక. మైత్రి సంస్థ నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఈ మూవీలో బన్ని స్టైలిష్ లుక్ తో పాటు మాస్ మసాలా లుక్ షాక్ ని ఇస్తాయని ఇంతకుముందు ప్రచారమైంది.
తాజా సమాచారం ప్రకారం.. బన్ని ఈ మూవీలో బాగా సన్నబడి కనిపిస్తాడని తెలుస్తోంది. ఊహించని ఓ కొత్త గెటప్ లో బన్ని సర్ ప్రైజ్ చేస్తాడట. అందుకోసమే ఫుల్ గా కసరత్తులు చేస్తూ సన్నబడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అలుపెరగకుండా పరుగులు పెట్టాడు. సరిగ్గా ఈ స్వీయ నిర్బంధ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు
మరోవైపు పుష్ప చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయాలనుకున్న సుకుమార్ కి అనుకున్నది అంత ఈజీగా ఏదీ కావడం లేదు. ఓవైపు వైరస్ మహమ్మారీ తెలుగు రాష్ట్రాల్ని అట్టుడికించేస్తోంది. ఆ క్రమంలోనే టీమ్ వేచి చూసే ధోరణిని అనుసరిస్తోంది. సెప్టెంబర్ .. అక్టోబర్ .. డిసెంబర్ అంటూ వేచి చూడాల్సి వస్తోంది. కనీసం వచ్చే సంవత్సరం అయినా వ్యాక్సిన్ వస్తుంది అంటే అప్పుడే సెట్స్ కెళ్లడం బెటర్ అని హీరో సహా టీమ్ భావిస్తోందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై సుక్కూ టీమ్ అధికారికంగా వివరాల్ని వెల్లడిస్తుందేమో చూడాలి.