సింగింగ్ రియాలిటీ గ్రాండ్ ఫినాలేలో పుష్ప హంగామా

Update: 2023-05-24 09:26 GMT
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 'ఆహా-తెలుగు' (ఓటీటీ)లో జ‌న‌రంజ‌కంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే టాప్ 5 గాయకులను ఫైనల్ కి సిద్ధం చేయ‌గా.. ఈ ఎపిసోడ్ అతిథి ఎవ‌రు? అంటూ అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలేకు ఎవ‌రైనా అగ్ర హీరో గౌర‌వ అతిథిగా విచ్చేస్తారా? అన్న చ‌ర్చా సాగుతోంది. కానీ ఇంత‌లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా అలాగే న్యాయనిర్ణేతగా హాజరవుతారని 'ఆహా' టీమ్ ప్రకటించింది.

తాజాగా విడుద‌లైన ప్రోమో ఆక‌ట్టుకుంది. ఈ వీడియో ఆద్యంతం స్టైలిష్ స్టార్ గ్లిమ్స్ మెరిపించాయి. అల్లు అర్జున్ తన ఎగ్జయిట్ మెంట్ ని ఎక్క‌డా దాచుకోలేదు. అత‌డు సూట్ లో స్టైలిష్ లుక్ లో క‌నిపించాడు.

''త్వ‌ర‌లోనే సీజ‌న్ ముగింపు ..ఇది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో అత్యంత వినోదాత్మక ఎపిసోడ్ ఇదే''నంటూ ప్ర‌చారం సాగుతోంది. కార్తికేయ- లాస్య- సౌజన్య- జైరామ్ - శృతి నండూరి మొదటి ఐదుగురు గాయకులు ఫైన‌లిస్టులుగా నిలిచారు.

ఇక ఇలాంటి ఫైన‌ల్ ఎపిసోడ్స్ కి ఆహా ప్ర‌తిసారీ మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తుంది. కానీ ఈసారి పుష్ప 2 ప్ర‌మోష‌న్స్ పైనే ఎక్కువ ఫోక‌స్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈసారి గ్రాండ్ ఫినాలే గౌర‌వ అతిథిగా అల్లు అర్జున్ వ్య‌వ‌రించ‌నుండడం ఆస‌క్తిక‌రం.

తాజా గ్లిమ్స్ లో అల్లు మాట్లాడుతూ... తాను జ‌డ్జి హోదాలో ఉన్నాను కానీ ఇంత మంచి పాట‌కు లేచి డ్యాన్స్ చేయాల‌నిపిస్తోంద‌ని ఎగ్జ‌యిట్ మెంట్ ని ఆపుకోలేక‌పోయాడు. ఏది ఏమైనా పుష్ప 2 ని తెర‌పై వీక్షించేందుకు జ‌నం ఆస‌క్తిగా ఉన్నారు.


Full View

Similar News