టాలీవుడ్ లో ఇప్పుడు విపరీతమైన డిస్కషన్లకు తావిచ్చిన అంశం ఏంటంటే.. అసలు ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' పోస్టర్ పైన అల్లు అర్జున్ ను ఉద్దేశించి ''కింగ్ ఆఫ్ సోషల్ మీడియా'' అని ఎందుకు అన్నారు? ఈ విషయంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నా కూడా.. నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. అత్యధికంగా వ్యూస్ వచ్చిన టీజర్లు బన్నీ పేరున లేవు.. అలాగే అత్యధికంగా వ్యూస్ వచ్చిన సాంగ్స్ కూడా లేవు. కేవలం మొన్న వచ్చిన 'సరైనోడు' డబ్బింగ్ మూవీ ఒక్కటే భారీ క్లిక్కులు సంపాదించింది. ఆ మాత్రం దానికే బన్నీని కింగ్ అనేస్తారా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇప్పటివరకు డిజె దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ అన్నీ.. ఇంకా చాలా రికార్డులను బద్దలుకొట్టాల్సి ఉంది. మనోళ్లు బాహుబలి.. స్పైడర్ వంటి సినిమాల ట్రైలర్ల తాలూకు యుట్యూబ్ వ్యూస్ ను దాటితే కాని.. డిజె రికార్డులు సృష్టించనట్లు కాదు. అలాంటప్పుడు అప్పుడే బన్నీని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని ఎందుకు అన్నారు? ఇదే విషయంపై ప్రశ్నిస్తే.. బన్నీ టీమ్ మాత్రం ఒక లాజికల్ లెక్క చెబుతోంది. నిజానికి మనోళ్లు కింగ్ అనేసింది.. అల్లు అర్జున్ కు ఫేస్ బుక్ లో మరి ఇతర సోషల్ మాద్యమాల్లో ఉన్న ఫాలోయింగ్ మొత్తంగా కలుపుకుని చూసిన లెక్క కారణంగానేనట.
ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ కు అత్యధికంగా 1.2 కోట్ల మంది లైక్స్ ఉన్నాయి. ఇక ట్విట్టర్ విషయానికొస్తే.. తెలుగు హీరోల్లో టాప్ పొజిషన్లో లేకపోయినా బన్నీకి 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మొత్తంగా 1.3 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వేరే ఏ హీరోకు చూసుకున్నా కూడా.. అంతేసిమంది ఫాలోవర్లు లేరట. అందుకే బన్నీను కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనేశాం అంటున్నారు ఆయన టీమ్. ఏదేమైనా కూడా.. డిజె ట్రైలర్ తో ఏదన్నా ప్రపంచాన్ని షేక్ చేసి రికార్డు ఒకటి క్రియేట్ చేసి.. అప్పుడు కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పుకుంటే బాగుంటుంది కాని.. ఏ రికార్డు కొట్టకుండా ఫేస్ బుక్ అండ్ ట్విట్టర్ ఫాలోయింగ్ చూసుకుని ఇలాంటి బిరుదులు సొంతంగా ఇచ్చుకుంటే బాలేదని సినిమా లవర్స్ ఫీలింగ్. ఒకవేళ ఆ అవార్డు ఏదో ఎవరైనా సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థల వంటి వారు ఇచ్చుంటే బాగుండేది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోవడం వలన బన్నీకి ఏ వివాదం లేదనుకున్న వేళ.. ఇప్పుడు ఈ 'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' ట్యాగ్ భలే వర్కవుట్ అవుతోందే. కానివ్ బన్నీ కానివ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/