సౌత్ ఇండియాలో మిగతా ఇండస్ట్రీల కంటే వెనుకబడ్డ పరిశ్రమగా శాండిల్ వుడ్ కు ఓ చెడ్డ పేరుంది. ఐతే ఈ మధ్య కన్నడ పరిశ్రమలో మార్పు కనిపిస్తోంది. లూసియా.. రంగితరంగ లాంటి సినిమాలు శాండిల్ వుడ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశాయి. ముఖ్యంగా సాయికుమార్ కీలక పాత్ర పోషించిన థ్రిల్లర్ మూవీ ‘రంగితరంగ’కు చాలా మంచి పేరొచ్చింది. ఈ సినిమా మన అల్లు అర్జున్ కు సైతం చాలా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని బెంగళూరులో ‘సరైనోడు’ ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా వెల్లడించాడు బన్నీ. కన్నడ సినిమాల గురించి.. అక్కడి తన అభిమానుల గురించి ఈ వేడుకలో బన్నీ ఏమన్నాడంటే..
‘‘నాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తెలుగు తర్వాత కర్ణాటక ఫ్యాన్స్ చాలా ప్రత్యేకం. నా సినిమాలు కన్నడ నాట ఆడుతున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను కన్నడ చిత్రాల్ని ఎంతో ఇష్టపడతాను. ఈ ఇండస్ట్రీని గౌరవిస్తాను. గత మూడేళ్లుగా కన్నడ సినిమాల్లో చాలా పురోగతి కనిపిస్తోంది. రంగితరంగ ఈ మధ్య నాకు బాగా నచ్చిన సినిమా. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పని చేయడానికి రెడీగా ఉన్నాను. క్యామియో రోల్ చేయడానికైనా రెడీ. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. ఇలా సౌత్ లోని నాలుగు భాషల్లోనూ సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అని చెప్పాడు బన్నీ.