ఏప్రిల్ నెలాఖరు వేడి.. ఓ నెల్లాళ్ల క్రితం నుంచే టాలీవుడ్ ని రాజుకుంది. అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య.. మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను మేకర్స్.. ఏప్రిల్ 27కే వస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. వీరిలో బన్నీ నిర్మాతలు ముందుగా డేట్ మేము ఇచ్చాము మేము మార్చము అంటున్నారు. మహేష్ ప్రొడ్యూసర్స్ కూడా డేట్ ముందు మేము ఇచ్చాము మేము మార్చము అంటున్నారు కానీ సినిమాను రిలీజ్ డేట్ మార్చడంలో రెండు సినిమాల నిర్మాతలు పట్టు వదలడం లేదు.
ఈ వివాదానికి ముగింపు పలికేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రయత్నించారనే టాక్ ఉంది. ఆయనే కాకుండా ఇండస్ట్రీ పెద్దలు కూడా గట్టిగానే ప్రయత్నించారు. కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఫిలిం ఛాంబర్ వర్గాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఆ రోజున ఎవరూ రావడానికి వీల్లేదని.. ఓ వారం ముందు ఒకరు.. ఓ వారం వెనుక ఒకరు సినిమాను రిలీజ్ చేసుకోవాలని సూచించారట. ఎవరు చెప్పినా బన్నీ అండ్ మహేష్ మూవీ మేకర్స్ మాత్రం పట్టు వదలడం లేదట. ప్రస్తుతం ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య పెద్ద స్థాయిలో సెటిల్మెంట్ జరుగుతోందని తెలుస్తోంది.
దీని ప్రకారం ఏప్రిల్ 26 లేదా 27న ఎవరూ రాకపోవచ్చని అంటున్నారు. ఏప్రిల్ 20న మహేష్ సినిమా భరత్ అనే నేను.. మే 4వ తేదీన నా పేరు సూర్య విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరు కాసింత తగ్గినా.. అది ఇండస్ట్రీ మొత్తానికి మేలు చేసే విషయంగా చెప్పవచ్చు. అయితే ముందు డేట్ ఇచ్చాం అని బన్నీ టీమ్.. మాక్కూడా అదే డేట్ కావాలంటూ మహేష్ టీమ్ నానా యాగీ చేస్తున్నారని భొగొట్టా.
నిజానికి ఈ ఇద్దరూ ఒకే డేట్ లో వస్తే.. ఇద్దరికీ నష్టమే. ఓపెనింగులు మిస్సవుతాయి. అదే వేర్వేరు డేట్లలో వస్తే.. ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టే ఛాన్సుంది. అందరూ వీరిని ఆలోచించమనేది దాని గురించే. నిజానికి ఇలా బన్నీ వెనక్కెళ్ళి మహేష్ ముందకెళితే.. బన్నీకి ధియేటర్లు ఉండవు అంటూ కొందరు దుష్ర్పాచారం చేస్తుంటే.. అబ్బే మహేష్ డేటు మారితే మడం తిప్పాడు వెనక్కి తగ్గాడు అని ఫ్యాన్స్ హర్టవుతారు అంటూ ఇంకొందరు అటు కూడా పుల్లలు పెట్టేస్తున్నారు. కాని సినిమాలు తేడాపడితే ఇలాంటి గ్యాంగులు ఎక్కడా కనిపించవ్. అప్పుడు నష్టపోయేది ప్రొడ్యూసర్లే.