మామూలుగా హిందీ సినిమాలు చాలా కలక్షన్లు సాధించడానికి ఒక కారణం ఏంటంటే.. కేవలం వారి రిలీజ్ మార్కెట్ పెద్దది కావడం అనేదే కాదు.. వారు చక్కగా ఒక సినిమాను రిలీజుకు 3 వారాల నుండి గట్టిగా ప్రమోట్ చేస్తారు కూడా. హీరో హీరోయిన్లూ డైరక్టరూ ప్రొడ్యూసరూ నానా రచ్చ చేస్తుంటారు. అందుకే ఆ ప్రమోషన్ల తాకిడికి బీభత్సమైన ఓపెనింగులు వస్తాయి.
టాలీవుడ్ సంగతి తీసుకుంటే.. మన పెద్ద హీరోలు చాలామంది బజ్ వస్తే చాలా ప్రమోషన్లు ఎందుకులే అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ హీరోలంటే అభిమానులకు పిచ్చి కాబట్టి.. వాళ్లే చూస్తారులే అనే ధీమా కాస్త ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ యాటిట్యూడ్ ఎన్నాళ్లో వర్కవుట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి వంటి సినిమాకు ఎక్కువ కలక్షన్లు రావడానికి.. పెళ్ళిచూపులు వంటి సినిమా భారీగా వసూలు చేయడానికి.. భారీ ప్రమోషన్లే కారణం. బాహుబలి ఇక్కడ పెద్దగా ఖర్చుపెట్టకపోయినా కూడా బాలీవుడ్లో బాగానే పెట్టారు. ఇక పెళ్ళిచూపులు సినిమాలు రిలీజ్ కు ముందే ప్రీమియర్లు అంటూ బీభత్సంగా ఊదరగొట్టేశారు. అలాంటప్పుడు కంటెంట్ కనక్ట్ అయ్యిందనుకోండి.. ఇక బాక్సాఫీస్ దగ్గర కాసుల పంటే.
ఇప్పుడు టాపిక్ ఏంటంటే.. వచ్చే శుక్రవారం డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా రిలీజ్. ఆ లెక్కన ఈపాటికే ప్రమోషన్లు అదిరిపోవాలి. కాని మనోళ్ళు ఆడియో రిలీజ్ తప్పిస్తే.. అంతకుముందు ఆ తరువాత ఏమీ పెద్దగా ప్రమోట్ చేసిందేలేదు. ఇప్పుడు కూడా హరీశ్ శంకర్ ఒక్కడే పిలిచి కొంతమంది మీడియా వాళ్ళకు ఇంటర్యూలు ఇవ్వడం తప్పిస్తే.. హీరో హీరోయిన్ ఇంకా రంగంలోకే దిగలేదు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా.. అకడమిక్ ఇయర్ కోసం ఓపెన్ అయిన స్కూళ్లకూ కాలేజీలకు వెళ్లే విద్యార్ధులను.. అలాగే వారిని సాగనంపుతూ బిజీగా ఉండే ఫ్యామిలీ ఆడియన్స్.. వీళ్లందరి చూపును తిప్పుకోవాలంటే.. డిజె ప్రమోషన్లు చేసుకోవాలి. లేదంటే సీన్ తేడా వస్తుందంతే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/