విజయానికి ఉన్న శక్తి ఎంతన్నది తాజాగా అల్లుఅర్జున్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. దారుణమైన డిజాస్టర్ తర్వాత దాదాపు ఏడాదిన్నర ఖాళీగా ఉన్న అతడు కసిగా చేసిన సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర విజయం మీద నమ్మకం ఉన్నా.. దాని కంటే కూడా ఓటమి తర్వాత తన పరిస్థితి గురించి తరచూ ప్రస్తావించాడు. అల విడుదలయ్యాక.. దాని రిజల్ట్ తో బన్నీ మాటలు పూర్తిగా మారిపోయాయి. సినిమా విడుదలకు ముందు వరకూ మాట్లాడిన ఏడాదిన్నర ఖాళీ మాటను ఇప్పుడు అస్సలు ప్రస్తావించటం లేదు.
సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ.. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పటం.. తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించిన సిగ్నల్స్ ఇవ్వటం కనిపిస్తుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత పూర్తి వినోదంతో ఉండే పెద్ద సినిమా చేయాలనుకున్నప్పుడు తనకు గుర్తుకు వచ్చిన మొదటిపేరు త్రివిక్రమ్ అని చెప్పటం ద్వారా.. మాటల మాంత్రికుడు తనకెంతో స్పెషల్ అన్న విషయాన్ని బన్నీ చెప్పేశారని చెప్పాలి.
తాజాగా మూవీ రికార్డు కలెక్షన్లు ఖాయమన్న మాట అందరి నోట వినిపిస్తున్న వేళ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బన్నీ. రాధాకృష్ణ, త్రివిక్రమ్‌గార్లతో హ్యాట్రిక్ కొట్టాం. మా నాన్నకు బాగా డబ్బులు రావాలని, అందులో నాకు వాటా ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ నవ్వేశాడు. డీజే తర్వాత పూజాహెగ్డేతో తాను సినిమా చేశానని.. తనతో మళ్లీ నటించాలని ఉందని చెప్పటం చూస్తే..తన తర్వాతి సినిమాలోనూ పూజానే హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పక తప్పదు.
సాధారణంగా హీరోయిన్లు తాము కంఫర్ట్ గా ఫీలైన దర్శకుడి పేరును.. హీరో పేరును ప్రస్తావిస్తూ తర్వాతి ప్రాజెక్టులో కూడా అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందుకు భిన్నంగా హీరోల నోటి నుంచి అలాంటి విష్ లు రావు. కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం బన్నీ నోటి నుంచి వచ్చిన మాట చూస్తుంటే.. అతగాడి తర్వాతి సినిమాలో పూజానే హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో?