జపనీస్‌ లో 'రాజాసాబ్' సాంగ్.. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఆటా పాటా!

చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ సాంగ్స్ తో వస్తున్నారని తెలిపారు.

Update: 2025-01-08 06:44 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో "ది రాజాసాబ్" ఒకటి. మారుతి దర్శకత్వంలో ఈ రొమాంటిక్ హారర్ కామెడీ తెరకెక్కుతోంది. దీనికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డార్లింగ్ సినిమాకు తొలిసారి వర్క్ చేస్తుండంతో మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్, మోషన్ పోస్టర్ లలో బీజీఎం అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా థమన్ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ అప్డేట్స్ అందించారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ సాంగ్స్ తో వస్తున్నారని తెలిపారు.

థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన 'గేమ్ చేంజర్' & 'డాకు మహారాజ్' సినిమాలు సంక్రాంతికి రెండు రోజుల గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ - మారుతి మూవీ గురించి కూడా మాట్లాడారు. "ప్రభాస్ గారి 'రాజాసాబ్‌' సినిమా రాబోతోంది. జపాన్ లో కూడా ఆడియో లాంచ్‌ జరుగుతుంది. అందుకే జపనీస్‌ వెర్షన్‌లో కూడా ఓ సాంగ్‌ చేయమని మేకర్స్‌ నన్ను అడుగుతున్నారు" అని థమన్ చెప్పారు.

"ప్రభాస్ చాలా కాలం తర్వాత మాస్ సాంగ్స్ తో రాబోతున్నారు. సినిమాలో హీరోయిన్ తో ఒక డ్యూయెట్‌, ఒక ఐటమ్ సాంగ్, లాస్ట్ లో ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, ఓపెనింగ్ లో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌, రాజాసాబ్ వరల్డ్ కి ఒక థీమ్ సాంగ్ ఉన్నాయి. ఆ సినిమా ఒక ఫెయిరీ టేల్. ఎవరికీ ఆ సినిమాపై ఎక్కువ హైప్ లేదు. మాకు అది మంచిది. ఆడియన్స్ లో ఓహో అనేంత ఓవర్ హైప్ లేదు. అదే మాకు కావాలి. ఎంత తక్కువ అంచనాలు ఉంటే, థియేటర్లో ఒక్కో పాటకు అంత వావ్ వస్తుంది" అని థమన్ చెప్పుకొచ్చారు.

థమన్ చెప్పినట్లు ప్రభాస్ మాస్ సాంగ్స్ చాలా సంవత్సరాలు అయింది. 'మిర్చి' తర్వాత ఆయన నటించిన సినిమాల్లో డ్యాన్స్ చేసే అవకాశం దొరకలేదు. దాదాపు 12 తరువాత అభిమానులు 'ది రాజాసాబ్' మూవీలో డార్లింగ్ మాస్ స్టెప్పులు చూడబోతున్నారు. అందుకే ఆ విషయంలో అందరూ ఎంతో ఎగ్జైంటింగ్ గా ఉన్నారు. ఇదొక మంచి మాస్‌ కమర్షియల్‌ ఆల్బమ్‌ అని, మొత్తంగా ఆరు పాట‌లు ఉంటాయని థమన్ ఇంతకముందు ఓ సందర్భంలో చెప్పారు.

ఒక రీమిక్స్ సాంగ్ ఉంటుందని.. పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, అందర్నీ అలరించే పాటను రీమిక్స్‌ చేయాలనుకుంటున్నామని థమన్ తెలిపారు. అంతేకాదు 'రాజాసాబ్' నుంచి సంక్రాంతి పండక్కి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు లాస్ట్ ఇయర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇటీవల డైరెక్టర్ మారుతి మాత్రం ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తామని అన్నారు. మరి ఫ్యాన్స్ కోసం పొంగల్ కు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.

'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లలో లో టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Tags:    

Similar News