అల్లు పాప అల్లరి పాప

Update: 2019-02-08 11:53 GMT
టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ లు వీలు చిక్కినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. పిల్లలతో ఈ ఇద్దరు సరదాగా ఆడుకునే ఆటలు సోషల్‌ మీడియాలో వారి వారి అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. వీరిద్దరు పిల్లలతో చాలా జోవియల్‌ గా గడుపుతూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్‌ మరియు ఆయన కూతురు అర్హ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కూతురుతో సరదాగా ఆడుకుంటున్న అల్లు అర్జున్‌ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాడు.

అల్లు అర్జున్‌ సరదాగా తన కూతురుతో నాన్న నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పించేందుకు ప్రయత్నించగా, అర్హ మాత్రం పెళ్లి చేసుకోను అంటూ సమాధానం ఇవ్వడం అందరిని ఆశ్చర్య పర్చుతోంది. మై దొంగ ఫెల్లో అంటూ అల్లు అర్జున్‌ తన అల్లరి కూతురు వీడియోను పోస్ట్‌ చేశాడు. బన్నీ పోస్ట్‌ చేసిన నిమిషాల్లోనే ఈ వీడియో వేలల్లో వ్యూస్‌ సొంతం చేసుకుంది. కొన్ని గంటల్లోనే రెండులక్షలకు పైగా వ్యూస్‌ ను పొందింది.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూవీని మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. నా పేరు సూర్య ఫ్లాప్‌ కారణంగా బన్నీ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఎట్టకేలకు త్రివిక్రమ్‌ మూవీని పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News