బాహుబలి, కేజీఎఫ్ తరహాలోనే ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే వార్త కొన్ని రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీని గురించి యూనిట్లో ముఖ్య వ్యక్తుల మధ్య చర్చ జరిగిన మాట వాస్తవం. ఈ ఆలోచనపై జనాలు ఏమంటారో చూద్దామని మీడియాకు పీలర్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫీడ్ బ్యాక్ కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారు. ఐతే ‘పుష్ప’ను రెండు భాగాలుగా విడుదల చేయాలన్న ఆలోచన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
తన కెరీర్లోనే మరే సినిమాకూ లేనంతగా ‘పుష్ప’ కోసం రీసెర్చ్ చేశాడు సుకుమార్. రాయలసీమకు చెందిన ఒక యువ రచయిత ఆయనకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి బోలెడంత సమాచారం ఇచ్చారు. మరికొందరి సహకారం కూడా తోడై సుకుమార్ ఈ సబ్జెక్టు మీద కోరుకున్నదానికంటే ఎక్కువ సమాచారమే లభించింది. ఆ సమాచారంలోంచి అదిరిపోయే సన్నివేశాలు తయారయ్యాయి. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు వర్క్ అంతా చూసుకుంటే రెండు సినిమాల కంటెంట్ తయారైందట. ఐతే అందులోంచి రెండున్నర గంటల నిడివికి సరిపోయేలా సన్నివేశాలు ఏరుకుని షూటింగ్ మొదలుపెట్టారు.
ఐతే భారీగా లొకేషన్లు, కాస్టింగ్‌తో ముడిపడ్డ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరగట్లేదు. పైగా కరోనా ఒకటికి రెండుసార్లు ఈ సినిమాకు బ్రేకులేసింది. పైగా ఈ బ్రేకుల వల్ల బడ్జెట్ కూడా బాగా ఎక్కువైపోయింది. ప్రి ప్రొడక్షన్‌కే కొన్ని కోట్లు ఖర్చయ్యాయి. తర్వాత షూట్ చేసిన సన్నివేశాలకు కూడా అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చే అయింది. సినిమా అంతా అయ్యేసరికి బడ్జెట్ హద్దులు దాటేస్తుందన్న భయం దర్శక నిర్మాతల్లో ఉంది. మరోవైపు అనుకున్నట్లుగా సినిమా తీయడంలోనూ చాలా ఆలస్యం జరిగేలా ఉంది. పుష్ప వచ్చే ఏడాది కానీ రిలీజయ్యే అవకాశం ఉండదు.
ఈ నేపథ్యంలో సినిమాను రెండు భాగాలుగా తీస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయనే ఆలోచన చేశారట. రెండు భాగాలు చేస్తే.. తన దగ్గరున్న కంటెంట్ మొత్తం వాడుకోవచ్చు. అలాగే ఆదాయం పెరుగుతుంది కాబట్టి బడ్జెట్ కష్టాలు తీరిపోతాయి. ఖర్చు విషయంలో రాజీ పడకుండా అనుకున్నట్లుగా సినిమా తీయొచ్చు. ఫస్ట్ పార్ట్ సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయొచ్చు. ఇవన్నీ చూసుకునే రెండు భాగాలుగా ‘పుష్ప’ను రిలీజ్ చేయడంపై కొంచెం తీవ్రంగానే ఆలోచిస్తున్నారట సుక్కు అండ్ కో.