అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. గత నవంబర్ లోనే ఈ డెసిషన్ తీసుకున్న పుష్ప టీమ్.. కథను రెండు భాగాలు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు నెలల పాటు చిత్రీకరణ జరిపి ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన మెజారిటీ భాగం పూర్తి చేశారు. ఒక ఐటమ్ సాంగ్ మరియు కొన్ని సన్నివేశాల షూట్ మాత్రమే పెండింగ్ ఉంది. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా మొదటి భాగాన్ని కంప్లీట్ చేయడమే కాకుండా.. సెకండ్ పార్ట్ షూట్ ని మొదలు పెట్టాలని చూస్తున్నారు.
'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడే, మేకర్స్ దీనికి తగ్గట్టుగా బడ్జెట్ ని కేటాయించుకున్నారు. రెండు పార్ట్స్ కి కలిపి మొత్తంగా రూ.250 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో అనే చర్చ మొదలయింది. వాస్తవానికి ఈ బడ్జెట్ లో సింహభాగం నటీనటులు - సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ కే పోతుంది. అంటే మేకింగ్ కు సుమారు వంద కోట్లు బడ్జెట్ అవుతుండొచ్చు.
అయితే ఎంత బడ్జెట్ అయినా సరే బిజినెస్ పరంగా ఇబ్బందేమీ ల్లేదనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురములో' తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే బిజినెస్ జరుగుతుందని.. ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.450 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారట. మరి ఈ ప్రయోగం వర్కౌట్ అయి 'పుష్ప' భారీ విజయం అందుకుంటుందో లేదో చూడాలి.
కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే 'పుష్ప' సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.వ్రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.