ముగ్గురూ అదే టైములో ఎందుకో!!

Update: 2017-10-28 01:30 GMT
టాలీవుడ్ లో బడా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయంటే చాలా చాలా వరకు కొన్ని చిన్న సినిమాలు ఆ దరిదాపుకు కూడా రావు. అయితే కొన్నిసార్లు పండగలప్పుడు కొన్ని సినిమాలు హిట్ అయినా మళ్లీ హిట్ అవుతాయా లేదా అనేది కాస్త అనుమానమే సుమీ.. ఇక బడా హీరోలు కూడా అప్పుడపుడు పోటీకి సై అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం వారి సినిమాలతో మూడు ముక్కలు ఆడినట్లు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

వారు ఎవరో కాదు ఇద్దరు మెగా హీరోలైతే మరొకరు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్. అల్లు అర్జున్ - రామ్ చరణ్ వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలను వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 28నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా మహేష్ బాబు కూడా కొరటాల శివతో చేస్తోన్న భారత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 27నే రిలీజ్ చేస్తున్నాడు. అసలే ఈ రోజుల్లో ఏ సినిమాకైనా కలెక్షన్స్ ఫస్ట్ వీక్ లోనే గట్టిగా వస్తాయి. ఎంత పెద్ద సినిమాకైనా మొదటి వారమే బెనిఫిట్. ఆ తర్వాత వచ్చేవి కొంత లాభం, కానీ అప్పటిలోపే పైరసీ దెబ్బ పడే ప్రమాదం ఉండవచ్చు.

రామ్ చరణ్ రంగస్థలం 1985పై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా మంచి బిజినెస్ చేయడం ఖాయం. ఇక మహేష్ - కొరటాల కాంబో పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు సినిమాలు వేటికవే సాటి. చాలా డిఫరెంట్ సినిమాలు. మరి ఇంత మంచి సినిమాలు ఒకే డేట్స్ లో వస్తే పేకాట లాగ ఎవరికీ ఎన్ని కలెక్షన్స్ వస్తాయో ఎవ్వరు అంచనా వేయలేరు. మరి ఈ క్లాష్ లో ఎవరు ముందడుగు వేస్తారో ఎవరు వెనుకడుగు వేస్తారో చూడాలి.   



Tags:    

Similar News