బన్నీ రోల్ ఎంత సేపంటే..

Update: 2015-07-25 07:57 GMT
'రుద్రమదేవి' మీద ఏకంగా 70 కోట్ల బడ్జెట్ పెట్టేశాడు గుణశేఖర్. అనుష్క అంత భారాన్ని మోయడం కష్టమని భావించి గోన గన్నారెడ్డి పాత్ర కోసం తన ఫేవరెట్ హీరో మహేష్ బాబును అడిగాడు కానీ.. అతనొప్పుకోలేదు. ఐతే అల్లు అర్జున్ ఈ పాత్ర చేయడాని కి ఓకే అనడంతో ఊపిరి పీల్చుకున్నాడు గుణ. బన్నీ రాకతో ఆటోమేటిగ్గా 'రుద్రమదేవి'కి స్టార్ వాల్యూ యాడ్ అయిపోయింది. ఐతే బన్నీని ఊరికే అలా రెండు మూడు సన్నివేశాల్లో చూపించి ముగించేస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారని భావించి అతడి పాత్ర నిడివి బాగా పెంచినట్లు సమాచారం. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ పాత్ర 20 నిమిషాలకు మించి కనిపించదట. ఐతే బన్నీ పాత్ర ఎంత పెరిగితే సినిమాకు అంత  వెయిట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో నిడివి పెంచి గంట పాటు గోన గన్నారెడ్డి పాత్ర కనిపించేలా చేశాడట గుణ.

రుద్రమదేవి సినిమా లో బన్నీ నటించడం గురించి గుణశేఖర్ మాట్లాడుతూ.. ''మహా యజ్నం లాంటి ఈ సినిమా లో తాను కూడా భాగమవుతానని గోన గన్నారెడ్డి పాత్ర లో నటించేందుకు ముందుకొచ్చాడు అల్లు అర్జున్. ఆయన పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుంది. ఆయన షూటింగ్ లో పాల్గొన్నది 30 రోజులే అయినా.. సినిమా కోసం నెల  రోజుల పాటు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర గంట సేపు కనిపిస్తుంది'' అని వెల్లడించాడు గుణశేఖర్. బన్నీకి మలయాళం లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టి లో ఉంచుకుని ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయబోతున్నాడు గుణశేఖర్. ముందు అనుకున్నదాని ప్రకారమైతే 'రుద్రమదేవి' తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదలవ్వాలి. మూడు భాషల్లో సెప్టెంబరు 4న విడుదల చేసి.. కొంచెం ఆలస్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నాడు గుణ.
Tags:    

Similar News