సాయిధరమ్ కెరీర్ ప్రస్తుతం ఏమంత బాగోలేదు. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇకమీదట హిట్ కొట్టకపోతే.. మనోడ్ని మర్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి టైమ్‌లో సీన్లోకి మెగాస్టార్ ఎంటర్ అయ్యారు. అల్లు అరవింద్‌ని కలిసి సాయితో మంచి సినిమా తీయమని ఆర్డర్ వేశారు. ఇప్పటికిప్పుడు అరవింద్ చేతిలో ఉన్న డైరెక్టర్ పరుశురామ్. పరుశురామ్ ఏమో బన్నీని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకుంటున్నాడు. బన్నీ కూడా పరుశురామ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు. కథ కూడా దాదాపుగా పూర్తైంది. మరి ఇలాంటి టైమ్‌లో ఇప్పుడు వేరే సినిమా, వేరే కథ అంటే కష్టం. కానీ బన్నీ మాత్రం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. త్యాగరాజు అవతారం ఎత్తాడు.
సాయి కెరీర్ మళ్లీ ఊపందుకోవాలంటే.. పరుశురామ్ లాంటి యూత్ పల్స్ తెలిసిన దర్శకుడు కావాలి. అందుకే పరుశురామ్ని సాయిధరమ్ తేజ్ కోసం త్యాగం చేసేశాడు. తన కోసం ఇప్పటికే త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు. అదీగాక.. సాయికి హిట్ తప్పనిసరి. కానీ బన్నీకి అలాకాదు. ఆల్రెడీ స్టార్. ఇలాంటి స్టార్‌కు త్రివిక్రమ్ కలిస్తే సినిమా హిట్ గ్యారంటీ. ఇవన్నీ ఆలోచించే.. తన దర్శకుడ్ని సాయి ధరమ్ కోసం ఇచ్చేశాడు బన్నీ.