దర్శకులకు బన్నీ సెంటిమెంట్

Update: 2017-09-27 04:00 GMT
సినిమా తారలు ఒక సినిమా హిట్ కావడానికి ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే స్థాయిలో కొన్ని కొన్ని నమ్మకాలని కూడా నమ్ముతుంటారు. అంతే కాకుండా ఒక పని చేస్తే కలిసొస్తుంది అంటే చాలు అదే పనిగా చేస్తూ.. ఉంటారు. ఎంతలా అంటే అపజయం అందిన మొదటి సారి జరిగింది అని నమ్మకంతో మరో విజయం అందే వరకు ప్రయత్నాలు చేస్తుంటారు..

ఇక అసలు విషయానికి వస్తే.. ఎవరైనా దర్శకుడు సినిమాను తెరకెక్కించినపుడు. ఆ సినిమా హిట్ అవ్వాలంటే.. ముందుగా హీరో అల్లు అర్జున్ కి ఓ కథ చెప్పాల్సిందేనట. సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సినిమాను తెరకెక్కిస్తున్నపుడు దర్శకుడు హరీష్ నిర్మాత పర్మిషన్ తీసుకొని వెళ్లి అల్లు అర్జున్ తో సినిమాను ఒకే చేయించుకున్నాడు. ఆ సినిమా ప్రభావం ఏమిటో గాని అపజయంలో ఉన్న దర్శకుడికి మాత్రం ఆ సింటిమెంట్ వర్క్ బాగా పనిచేసింది.

ఇక బాబీ కూడా అదే తరహాలో జై లవకుశ షూటింగ్ లో ఉన్నపుడు దర్శకుడు ఒక స్క్రిప్ట్ తో   వెళ్లి కలిసి వచ్చేశాడట.  ఇప్పుడు జై లవకుశ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది
దీంతో  రాబోయే ప్రాజెక్ట్ లో మొదలు పెట్టాక బన్నీని  కలిసి ఎదో ఒక స్క్రిప్ట్ చెప్పి వస్తున్నారట. ప్రస్తుతం బన్నీ తనకు రేసుగుర్రం లాంటి కథను ఇచ్చిన వక్కంతం వంశీ తో నా పేరు సూర్య అనేసినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఊటీ లో షూటింగ్ చేస్తున్నారు.
Tags:    

Similar News