తాను మహేష్ ని అంటున్న అల్లు అయాన్

Update: 2017-05-22 06:53 GMT
సహజంగా స్టార్ హీరోల ఫ్యామిలీస్ లో.. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకూ తమ అభిమాన హీరోలు ఎవరంటే.. ఫ్యామిలీ పేర్లే చెబుతూ ఉంటారు. తాము చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం చిన్న వయసులో ఉంటే.. కాసింత మెచ్యూరిటీ వచ్చాక అలా చెప్పాలనే సంగతి తెలుసుకోవడంతో.. అవే పలుకులు పలుకుతారు.

ఇది అన్నిచోట్లా జరిగేదే అయినా.. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నాడు. ఇంకా మూడేళ్లు కూడా నిండని అయాన్.. ఇప్పుడు బుజ్జి బుజ్జి మాటలతో అలరిస్తున్నాడు. కెమేరాలకు కబుర్లు కూడా చెబుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అల్లు అయాన్ తో కూడా మాట్లాడించారు. నీ పేరేంటి అని అడిగితే.. 'అయాన్' అని చెప్పిన ఈ బుడతడు.. మీ డాడ్ పేరేంటంటే 'అల్లు అర్జున్' అన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సైకిల్ తొక్కేటపుడు నువ్వు ఎవరో చెప్పు అని అడిగితే మాత్రం 'మహేష్ బాబు' అనేశాడు.

శ్రీమంతుడు సినిమాలో మహేష్ సైకిల్ తొక్కే సీన్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు అల్లు అయాన్ పై కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న మాట. అందుకే సైకిల్ తొక్కేటపుడు మాత్రం తాను 'మహేష్ బాబు'ని అనేస్తున్నాడు ఈ అల్లు ఫ్యామిలీ వారసుడు.

Full View
Tags:    

Similar News