ఘరానా మొగుడితో పోలికేంటి?

Update: 2015-04-09 04:56 GMT
9 ఏప్రిల్‌ 1992.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఘరానామొగుడు' రిలీజ్‌ తేదీ. రూ.10కోట్లు షేర్‌తో టాలీవుడ్‌ రికార్డులన్నిటినీ తిరగరాసింది ఈ సినిమా. దాదాపు 23ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే తేదీన అంటే 9 ఏప్రిల్‌ 2015లో అదే కాంపౌండ్‌ హీరో బన్ని నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' రిలీజవుతోంది. ఘరానామొగుడు లానే ఈ సినిమా రికార్డులు బద్ధలు కొడుతుందా? కొడితే ఆ రికార్డు ఎంత? అని లెక్కలు తీస్తున్నారు మనవాళ్లు.

అయితే అప్పటికి, ఇప్పటికి ఎంత తేడా? నాటికి, నేటికి ఏ పోలికా లేదు. ఘరానామొగుడు రిలీజ్‌ నాటికి మెగాస్టార్‌ చిరంజీవి ఒక్కడే పరిశ్రమని ఏళ్త్తున్నాడు. కానీ ఇప్పటి పరిస్థితే వేరు. బన్నితో పాటు రేసులో మహేష్‌, చరణ్‌, పవన్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ లాంటి ఉద్ధండులైన హీరోలున్నారు. బాక్సాఫీస్‌ రికార్డుల్ని తిరగరాసే సత్తా ఉన్న హీరోలే వీరంతా. ఇప్పుడు ఏదైనా రికార్డు వచ్చినా దాన్ని చాలా తక్కువ సమయంలోనే వేరొక హీరో బద్ధలు కొట్టేయడం ఖాయం. అలాగే అప్పుడు ఏదైనా సినిమా 100రోజుల్నుంచి 365రోజులు ఆడిస్తేనే రికార్డులొచ్చేవి. కానీ ఇప్పటి సినిమా తొలివారంలోనే రికార్డు వసూళ్లు సాధిస్తోంది. భారీ స్క్రీన్లలో ఆడించేస్తున్నారు. ఇప్పటికైతే బన్ని రేసుగుర్రం రికార్డును అధిగమిస్తే సరిపోతుంది.

ఇక థియేట్రికల్‌ హక్కుల రూపంలోనే సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాని 54కోట్లకు అమ్మారు కాబట్టి ఈ సినిమా కచ్ఛితంగా 60కోట్లు పైగానే వసూలు చేయాల్సిందే. అందుకే 1375 థియేటర్లలో, 1475 స్క్రీన్లలో ఈ సినిమా వేస్తున్నారు. కనీసం అత్తారింటికి దారేది రికార్డును టచ్‌ చేసినా సత్యమూర్తి ఘనుడే అని ఒప్పుకోవచ్చు. ఈరోజే రిలీజ్‌ కాబట్టి వెయిట్‌ అండ్‌ సీ..
Tags:    

Similar News