మెగాస్టార్ చిరంజీవి 61వ బర్త్ డే సెలబ్రేషన్స్ కు అభిమానులతో జరుపుకోవడానికి తన మెగా కజిన్స్ అందరితో కలసి శిల్పాకళావేదికకు వచ్చిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్... ఈసారి కేవలం చిన్న స్పీచ్ తో సరిపెట్టేశాడు.
''స్టార్ స్టార్ మెగాస్టార్.. బాస్ ఈజ్ బ్యాక్'' అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టిన బన్నీ.. ''ఏ హీరోకు ఫ్యాన్స్ ఇంత పెద్ద రేంజులో ఫంక్షన్ చేసే స్టారే ఉండరు. ఆ అదృష్టం మెగాస్టార్ ఒక్కరికే ఉంది. అందుకే ఆయన తరుపును నేను కృతజ్ఞతలను చెబుతున్నాను'' అన్నాడు. కేవలం ఒకే ఒక్క మాట చెప్పేసి వెళిపోతానంటూ ఒక డైలాగ్ చెప్పాడు. ''బొట్టు పెట్టుకోని హిందువుని.. టోపీ వెయ్యని ముస్లింని.. శిలువ వేసుకోని క్రైస్తవుడిని.. టోటల్ గా ఈ పేటకు మేస్ర్తిని'' అంటూ అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి ''ముఠామేస్ర్తి'' సినిమాలో చెప్పిన డైలాగ్ చెప్పాడు బన్నీ.
ఇకపోతే అల్లు అర్జున్ స్టేజీమీదకు రాగానే.. అభిమానుల్లో కొందరు ఎవరైనా ''చెప్పను బ్రదర్'' ఇన్సిడెంటును మైండ్లో పెట్టుకుని ఆయన్ను ఇబ్బంది పెడతారేమో అనుకున్నారు కాని.. అలాంటివేం జరగలేదు. బన్నీ స్మూత్ గా తన మాటలను ఓ నిమిషంలో ముగించేసి చెక్కేశాడు.