ఆర్మీలో చేరేందుకు అల్లూ హీరో రెడీ

Update: 2018-05-07 05:09 GMT
కొన్ని క్యారెక్టర్లు ఆయా నటులపై విపరీతంగా ప్రభావం చూపుతుంటాయి. వాటి నుంచి బయటకు రావడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఉంది. నా పేరు సూర్య మూవీలో అల్లు అర్జున్ ఆర్మీ పర్సన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు.. వసూళ్లు ఆశించిన స్థాయిలో కాకున్నా పర్లేదనిపించే రేంజ్ లోనే ఉన్నాయి.

థీమ్ బేస్డ్ మూవీ కావడంతో.. జనరల్ ఆడియన్స్ కు ఇంకా పూర్తిగా  కనెక్ట్ కాలేదు కానీ.. అల్లు అర్జున్ మాత్రం సినిమా చేస్తున్నపుడే పాత్రలోకి దూరిపోయాడనే విషయం మూవీ చూసిన వాికి అర్ధం అవుతుంది. రీసెంట్ గా నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులను చెప్పాడు బన్నీ. మోహన్ లాల్.. సచిన్.. ధోనీతో పాటు మరికొందరి మాదిరిగా.. అల్లు అర్జున్ ను కూడా ఆర్మీలో చేరాల్సిందిగా మేజర్ శ్రీనివాసరావు సూచించారు. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ చూసిన తర్వాత ఆయన ఈ మాట చెప్పారు.

అయితే.. దీనికి బన్నీ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. 'షూటింగ్ సమయంలోనే నాకు ఈ ఆలోచన వచ్చింది. అందుకే అవసరమైన  పత్రాలతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాను' అని చెప్పాడు బన్నీ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. క్యారెక్టర్ చేయడం మాత్రమే కాకుండా.. నిజంగానే ఆర్మీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడంటే.. ఈ పాత్ర ఎంతగా బన్నీపై ఎంతగా ప్రభావం చూపిందో అర్ధం అవుతుంది.


Tags:    

Similar News