స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇప్పటి దాకా చేయని ఒక టిపికల్ రోల్ గా ఫాన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న నా పేరు సూర్య షూటింగ్ చివరి దశలో ఉంది. మిలిటరీ ఆఫీసర్ గా నరనరాల్లో కోపం నింపుకున్న సూర్యగా బన్నీ చాలా కొత్తగా ఇందులో కనిపించబోతున్నాడని పోస్టర్స్ లో టీజర్ లో క్లియర్ గా అర్థమైపోయింది. రెగ్యులర్ మాస్ మాసాలకు దూరంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో అను ఇమ్మానియేల్ జోడి కట్టిన సంగతి తెలిసిందే. కాని ఫైనల్ రష్ చూసిన బన్నీ ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ ట్రాక్ కాస్త లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ ఇవ్వడం వల్ల అసలు పాయింట్ కు ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అవుతారేమో అన్న అనుమానం వచ్చిందట. వెంటనే దర్శకుడు వక్కంతం వంశీతో చర్చించి గంటా పదిహేను నిముషాలు ఉన్న ఫస్ట్ హాఫ్ ని ట్రిమ్ చేసే విధంగా ఆలోచించమని చెప్పినట్టు తెల్సింది.
బాగా లోతుగా పరిశీలించిన వక్కంతం వంశీకి కూడా బన్నీ అనుల మధ్య లవ్ ట్రాక్ అంత ఉండాల్సిన అవసరం లేదని ఫీల్ కావడంతో కత్తెరకు పని చెప్పమని ఎడిటర్ తో చెప్పినట్టు టాక్. పాపం అను. ఇప్పటి దాకా చేసిన సినిమాల్లో సరైన పాత్ర గుర్తింపు దొరక్క ఇబ్బంది పడుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు దీని మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుకి ఇది షాక్ ఇచ్చే విషయమే. పాటల్లో కూడా ఒక చరణం దాకా కోత వేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఉద్వేగానికి గురి చేసే ఇలాంటి యాక్షన్ మూవీలో లవ్ కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం కరెక్ట్ కాదు మరి.
యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో బన్నీకి తండ్రిగా నటిస్తున్నాడని తెలిసింది. సరిహద్దులతో పాటు దేశంలో ఉన్న శత్రువుల అంతం చూసే సిన్సియర్ ఆఫీసర్ గా అల్లు నటన పీక్స్ లో ఉందని వినికిడి. వచ్చే నెల ఆడియో విడుదల చేసి మే 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న నా పేరు సూర్య తెలుగుతో పాటు తమిళ, మలయాళ బాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.