అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. మెగా స్టార్ చిరంజీవితో పాటు ఇతర హీరోలతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు వచ్చాయి. అయితే కొన్నాళ్ల క్రితం గీతా ఆర్ట్స్ 2 పేరుతో కొత్త బ్యానర్ ను ప్రారంభించి బన్నీ నిర్మాణంలో అల్లు అరవింద్ చిన్న సినిమాలను సమర్పిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.
గీతా ఆర్ట్స్ 2 లో వచ్చిన భలే భలే మగాడివోయ్.. గీతా గోవిందం సినిమాలు సూపర్ హిట్ అవ్వగా టాక్సీవాలా సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి. వరుసగా ఈ బ్యానర్ నుండి సినిమాలు వస్తున్నాయి. బన్నీ వాసు కాన్సెప్ట్ బేస్డ్ కథలను పట్టుకుని తక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడం అల్లు అరవింద్ సమర్పిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ బ్యానర్ లో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న సినిమా లేదు. ప్రతి రోజు పండగే.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టాయి. చావు కబురు చల్లగా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక గత ఏడాది లో గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్స్ నుండి పక్కా కమర్షియల్.. ఊర్వశివో రాక్షసివో.. 18 పేజెస్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ సాధించాయి.
గత ఏడాది అల్లు అరవింద్ సమర్పించగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమా లు కూడా బ్రేక్ ఈవెన్ సాధించాయి కానీ ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా గీత గోవిందం రేంజ్ లో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేక పోతున్నాయి.. గీతా ఆర్ట్స్ 2 కి భారీగా లాభాలను తెచ్చి పెట్టడంలో ఈ మధ్య వచ్చిన సినిమాలు విఫలం అవుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.
గీతా ఆర్ట్స్ కాంపౌండ్ తమదైన శైలిలో సోషల్ మీడియాలో ఈ సినిమా ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ సినిమా తో అయినా అల్లు అరవింద్ అండ్ కో కు గీతా గోవిందం రేంజ్ లో కమర్షియల్ గా బిగ్ సక్సెస్ దక్కేనా చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.