అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ నయా బ్యాట్ మెన్ అవతారమెత్తాడు. భవిష్యత్తులో తన తండ్రిలాగా హీరో అవుతాడో ఏంటో తెలియదు కానీ... అప్పుడే గెటప్ లతో అదరగొడుతున్నాడు. హలోవీన్ 2016లో భాగంగా అల్లు అయాన్ బ్యాట్ మెన్ గెటప్ ధరించాడు. పాశ్చాత్య దేశాల్లో హలో వీన్ పేరుతో అక్టోబరు 31న ఓ ఫెస్టివల్ ని నిర్వహిస్తుంటారు. ఆ ఫెస్టివల్ లో చిన్నారులు విభిన్నమైన డ్రెస్సుల్ని ధరించి గెటప్పులతో సందడి చేస్తుంటారు. అందులో భాగంగానే అల్లు అయాన్ బ్యాట్ మెన్ గెటప్పుతో సందడి చేసినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే పేరుంది. ఆయన తనయుడు కూడా తండ్రి బాటలోనే ప్రయాణం చేస్తున్నట్టు అర్థమవుతోంది. బుడి బుడి అడుగుల వయసులోనే ఉన్న అల్లు అయాన్ అప్పుడే ఫొటోల్లో యమా స్టైలిష్ గా కనిపిస్తుంటాడు. అయాన్ హెయిర్ స్టైల్ - డ్రెస్సింగ్ స్టైల్... స్టైలిష్ స్టార్ వారసుడికి తగ్గట్టుగానే ఉంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/