అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ఎబిసిడి ఈ నెల 17న విడుదల కానున్న నేపధ్యంలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. క్లీన్ యుతో సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా సర్టిఫికేట్ తెచ్చేసుకుంది. సరైన తేది కోసం ఎదురు చూస్తూ పలుమార్లు వాయిదా పడ్డ ఎబిసిడి ఇదే టైటిల్ తో మలయాళంలో రూపొందిన బ్లాక్ బస్టర్ కి రీమేక్. ఇప్పటికే ట్రైలర్ తో పాటు ఆడియో పరంగా శిరీష్ సినిమాల్లో భారీ స్పందన దక్కించుకుంది.
మెల్ల మెల్లగా ఆడియో సింగల్ ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు కొట్టేసింది. శిరీష్ తో పాటు ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమవుతున్న మాస్టర్ భరత్ కూడా మరో ఆకర్షణగా నిలుస్తున్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన యువకుడు ఇండియాకు తిరిగి వచ్చాక పదే ఇబ్బందులను నేపధ్యంగా రూపొందించిన ఎబిసిడి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి
ఒక్క క్షణం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న శిరీష్ చాలా వడబోత తర్వాత ఈ కథను అంగీకరించాడు. రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకుడు. జూదా శాండీ మ్యూజిక్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ప్రీ రిలీజ్ పరంగా బజ్ బాగా వచ్చింది. మహర్షి సందడి ఆ టైంకాంతా తగ్గనున్న నేపధ్యంలో సమ్మర్ సీజన్ ని శిరీష్ ఎలా క్యాష్ చేసుకుంటాడో వేచి చూడాలి.