ల‌వ్ లో ఫెయిల్ అయిన అభిమానిని ఓదార్చిన అల్లు శిరీష్..!

Update: 2021-08-14 07:30 GMT
యువ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తోపాటుగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. అదే క్రమంలో అప్పుడప్పుడు నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు రిప్లై ఇస్తూ.. వాళ్ళు క్రియేట్ చేసే మీమ్స్ పై స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ స్టాలో ఓ అభిమాని అల్లు శిరీష్ ని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టగా.. యంగ్ హీరో దానిపై స్పందించారు.

అల్లు శిరీష్ హీరోగా నటించిన 'శ్రీర‌స్తు శుభ‌స్తు' సినిమాలో ప్రేమ‌లో ఫెయిలైన వారిని ఉద్దేశిస్తూ ఉన్న ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. 'లైఫ్ లో ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు.. ఏదో తెలియకుండా బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్.. మన క్యారక్టర్ ని మనమే తెలియకుండా చంపేసుకుంటాం' అంటూ శిరీష్ చెప్పే ఈ డైలాగ్ ని ఇప్పుడు ఓ అభిమాని షేర్ చేస్తూ 'సేమ్ ఫీలింగ్' యువ హీరోని ట్యాగ్ చేశాడు. దీనికి స్పందించిన శిరీష్.. తన ఫ్యాన్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

'అయ్యో.. ఏమి జరిగింది బ్రో?. అది కేవలం సినిమాలోని డైలాగ్ మాత్రమే. ప్రేమను వదులుకోవద్దు. కచ్చితంగా సరైనది వస్తుంది' అని అల్లు శిరీష్ కామెంట్ పెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే.. శిరీష్ ప్రస్తుతం ''ప్రేమ కాదంట'' అనే చిత్రంలో నటిస్తున్నారు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్లు హీరో కంప్లీట్ మేకోవర్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ ఫస్ట్ లుక్ ప్పోస్టర్ మంచి స్పందన తెచ్చుకుంది. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News