దేశముదురు సినిమాతో బన్ని టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. 6-ప్యాక్‌ను పరిచయం చేసిన తొలి హీరో అయ్యాడు. దాంతో పాటే ఎనర్జిటిక్ డ్యాన్సుల్ని, స్టయిలిష్‌లుక్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్‌కి అద్భుతమైన ప్రశంసలొచ్చాయి. ఆ తర్వాత ఆ గ్రాఫ్‌ని ఓ రేంజుకి తీసుకెళ్లాడు బన్నీ. మళ్లీ ఆ స్థాయిని టచ్ చేయాలంటే అంతకంటే రెట్టింపు కష్టించాలని మెగా హీరోలకు అర్థమయ్యేలా చెప్పాడు.
అందుకే ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో అయినా ఆ స్థాయిని టచ్ చేయాలనే ప్రయత్నాలు చేశారు. చరణ్ వస్తూనే చిరుత చిత్రంతో అంతే ఎనర్జీని చూపించే ప్రయత్నం చేశాడు.. కాబట్టే ఇప్పుడిలా ఎదిగాడు. ఇటీవలే వెండితెరకు పరిచయమైన సాయిధరమ్‌తేజ్ సైతం ఆ లెవల్ డ్యాన్సుల్ని, ఎనర్జీని మెయింటెయిన్ చేశాడు. పిల్లా నువ్వులేని జీవితం విజయం వెనుక అసలు రహస్యం కూడా అదే. ఇప్పుడు నవతరం హీరో అల్లు శిరీష్ సైతం అన్ననే ఫాలో అవుతున్నాడు.
తొలి సినిమాతో వచ్చిన విమర్శల్ని తిప్పి కొట్టాలని తపిస్తున్నాడు శిరీష్. అందుకే తన మూడో సినిమాకే 6ప్యాక్‌తో మెరిపించాలని ప్లాన్ చేశాడు. ఇక వరుణ్ తేజ్ కూడా బన్నీ లాగా స్టయిలిష్‌గా ఉండాలని చాలా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ఆ స్కోప్ లేకపోయినా తదుపరి సినిమాలో అలా ప్రయత్నిస్తాడట. ఇలా మెగా ఫ్యామిలీలో ఎవరేం చేసినా అందరికీ బన్నీయే ఇన్‌స్పిరేషన్.