మెగా ఫ్యామిలీనే కానీ మెగా హీరో కాదు..? వై దిస్ కొలవెరి డి..!

Update: 2022-11-02 13:25 GMT
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరు హీరోలకు ఒక మోస్తారు క్రేజ్ దక్కింది. నిన్న మొన్నే వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి కూడా ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడటం వల్ల మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు. కానీ మెగా ఫ్యామిలీనే అనిపించినా ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కి దగ్గరవని ఒకే ఒక్క హీరో అల్లు శిరీష్.

అదేంటి ఆయన అల్లు ఫ్యామిలీ హీరో కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాక అల్లు ఆర్మీ అంటూ తన ఫ్యాన్స్ కి ఒక కొత్త ట్యాగ్ తగిలించాడు కానీ మొన్నటిదాకా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేసింది కూడా మెగా ఫ్యాన్సే. ఆ విషయం ఆ స్టార్ కి కూడా తెలుసు. అయితే ఈమధ్యనే మెగా ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తున్నారని గుర్తించి అల్లు ఆర్మీ అంటూ ఓ కొత్త పేరు పెట్టాడు.

అయితే అల్లు శిరీష్ మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యామిలీ హీరోగానే కొనసాగుతున్నాడు. అయితే అతను కూడా ఊర్వశివో రాక్షసివో ఈవెంట్ లో మెగా ఫ్యాన్స్ కి ఝలక్ ఇచ్చాడు. మైక్ అందుకుని మాట్లాడటం మొదలు పెట్టిన అల్లు శిరీష్ కేవలం బాలయ్య ఫ్యాన్స్.. తన వెల్ విషర్స్.. ఫ్రెండ్స్ అన్నాడు తప్ప మెగా ఫ్యాన్స్ అని కానీ.. అల్లు ఫ్యాన్స్ అని కానీ అతని నోటి నుంచి రాలేదు. ఇంతకీ అల్లు శిరీష్ మైండ్ లో అసలు ఏముంది. అతను మెగా హీరోనా.. లేక అల్లు హీరోనా.. లేదు తనకంటూ సెపరేట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా వస్తున్న ఊర్వశివో రాక్షసివో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. రాకేష్ శశి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విషయంలో అల్లు శిరీష్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కంటెంట్ బాగుంటే మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ ఇద్దరు కలిసి తన సినిమాని హిట్ చేస్తారు.

అందుకే తన ఫ్యాన్స్ అని చెప్పకుండా కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అంటూ అల్లు శిరీష్ మాట్లాడటం షాకింగ్ గా ఉంది. అర్జెంట్ గా కెరియర్ లో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ కి ఈ సినిమా ఆ హిట్ జోష్ ఇచ్చేలా ఉంది. సినిమాకు పోటీగా మరో రెండు సినిమాలు వస్తుండగా ఈ లీగ్ లో అల్లు శిరీష్ తన సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News