రత్నం చెప్పిన 'చిరు' ఫిలాసఫీ

Update: 2016-08-14 04:17 GMT
ఓ దశాబ్ద కాలం క్రితం వరకూ ఏఎం రత్నం అంటే ఓ పెద్ద బ్రాండ్. భారీ సినిమాలు తీయడం.. సినిమాలతో ప్రయోగాలు చేయడమే కాదు.. సౌత్ సినిమాకి భారీ కాన్వాస్ ల సత్తా ఏంటో నిరూపించిన నిర్మాత ఈయన. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలతో మళ్లీ వార్తల్లోకి వచ్చారీయన. అయితే.. బాయ్స్.. ప్రేమికుల రోజు.. లు ఆశించిన  స్థాయిలో ఆడకపోవడంతో అప్పట్లో బాగా వెనకబడిపోయారు.

ఈయన బ్యాడ్ ఫేజ్ చాలా కాలం నడిచాక.. అజిత్ మళ్లీ ఛాన్స్ ఇవ్వడంతో పుంజుకున్నాడు. ఎన్నై అరిందాల్.. వేదాలం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో తిరిగి సినిమా నిర్మాణంలో వేగం పెంచారు. అయితే.. రత్నంకు అజిత్ ఛాన్స్ ఇవ్వడంపై చాలానే కామెంట్స్ ఉన్నాయి. దీనికి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఓ ఫిలాసఫీని గుర్తు చేసుకున్నారు. ' నేను ఓ ఆర్టిస్టును కాబట్టి.. ఎవరో ఒక  నిర్మాతకు సినిమా చేయాల్సిందే. నువ్వు సినిమాలు బాగా తీస్తావ్. అలాంటిది నీకెందుకు చెయ్యను? నాకు సూట్ అయ్యే కథతో వస్తే కచ్చితంగా చేస్తా’ అన్నారట మెగాస్టార్ చిరంజీవి.

తాను తీసిన సినిమాల ద్వారా ఆ నమ్మకం ఏర్పరచుకోగలిగానన్న ఏఎం రత్నం.. అజిత్ సినిమా చేయడం తన కమ్‌ బ్యాక్‌ కి కారణం అయిందని ఓపెన్ గానే ఒప్పుకున్నారు.

Tags:    

Similar News