టాలీవుడ్ కి చెందిన మాజీ అగ్ర నిర్మాతల్లో ఏ.ఎమ్.రత్నం ఒకరని చెప్పాలి. ఎక్కువగా తమిళ్ లో సినిమాలను చేసినా మొదటి తెలుగు సినిమాతోనే ఆయన కెరీర్ ను స్టార్ చేసి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను చేశారు. కోలీవుడ్ లొనే కాకుండా బాలీవుడ్ లోను పలు సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన సమర్పణలో వచ్చిన ఆక్సిజన్ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్సకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు వెబ్ సైట్స్ లో వచ్చి రివ్యూలు ఆయన్ను బాధపెట్టాయట.
ఏఎమ్.రత్నం మాట్లాడుతూ.. ఆక్సిజన్ టాక్ ప్రస్తుతం చాలా బావుంది. మొదటి రోజు కొంచెం డౌన్ లో ఉన్నా మౌత్ టాక్ తో సెకండ్ డే నుంచి రెస్పాన్స్ చాలా పెరిగింది. అయితే కొన్ని వెబ్ సైట్స్ ఇచ్చిన రివ్యూస్ మాత్రం చాలా బాధను కలిగించాయి. సినిమా మొదటి షోకే అలా రిజల్ట్ ని ప్రభావితం చేసేలా రివ్యూలు పెడుతుండడం చాలా బాధాకరం. ఒక నిర్మాత ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తాడు. అది అర్థం చేసుకోవాలి. నిర్ణయం చెప్పడంలో తప్పులేదు. కానీ కనీసం ఒక మూడు రోజులు ఆగి అభిప్రాయాన్ని తెలిపితే బావుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ పై అది చాలా ప్రభావం చూపుతుంది.. అన్నారు.
ఇక నా కుమారుడు జ్యోతిక్రిష్ణ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ లో మంచి మెసేజ్ ఉంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగాను ఉంది. అయితే త్వరలో తమిళ్ - హిందీ లో కూడా సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.. అని ఆయన చెప్పడం కొసమెరుపు. ఇక పవన్ కళ్యణ్ తో చేయబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. 2018 లొనే ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తాం. త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక నిర్ణయానికి వస్తానని రత్నం వివరించారు.