ఆ రీమేక్ మాస్ రాజాతో చేస్తారేమో!!

Update: 2016-09-30 11:30 GMT
తమిళంలో ఈ మధ్య వచ్చిన రొటీన్ మాస్ సినిమాల్లో ''వేదాళం'' చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో అజిత్ యాక్టింగ్ కూడా అదిరిపోతుంది. అటూ ఇటూ చూస్తే కాస్త 'ఊసరవెల్లి' సినిమానే అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్లు ఉండే ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని ఆ సినిమా ప్రొడ్యసర్ ఏ.ఎం.రత్నం ఎప్పటినుండో చూస్తున్నాడు.

అయితే మనోడు పవన్ కళ్యాణ్‌ డేట్లను పట్టేసి ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటుంటే.. అది వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు మరో హీరోతో సినిమా తెలుగు వర్షెన్ ను ముందుకు తీసుకెళదాం అని ఫిక్సయ్యాడట. అందుకే ఇప్పుడు మాస్ రాజా రవితేజతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. సినిమా తెలుగు వర్షన్ ను సంతోష్‌ శ్రీనివాస్ (హైపర్ - రభస ఫేం)తో డైరక్ట్ చేయించాలని కూడా సర్వం సిద్దం చేసినట్లు టాక్.

చాలా సంవత్సరాల తరువాత ఎట్టకేలకు ఒక హిట్టు కొట్టి అప్పుల బాధ నుండి బయటపడిన మేకప్ మ్యాన్ ఏ.ఎం.రత్నం.. ఇప్పుడు తెలుగులో కూడా సాలిడ్ గా ఒక హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్‌ అయితే బాగుంటుందని ఈయన ఆశ. అది వర్కవుటయ్యేలా లేదులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News