రామ్ చరణ్ నాయక్ లో హీరొయిన్ గా మెరిసి ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతోనూ మనకు పరిచయమున్న అమలా పాల్ వైవాహిక జీవితం ద్వారా చాలా వివాదాల్లో నలిగిపోయింది. దర్శకుడు విజయ్ తో విడాకుల వ్యవహారం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే ఆ మధ్య సినిమాలకు దూరంగా ఉండిపోయిన అమలా పాల్ మూడేళ్ళ క్రితం కం బ్యాక్ ఇచ్చి హీరొయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.
అందులో భాగంగా వస్తోందే ఆడై. లైంగిక హింస బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో అమలా పాల్ చాలా బోల్డ్ గా నటించిందని ఇప్పటికే చెన్నైలో టాక్ జోరుగా ఉంది. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలీ చాలని దుస్తుల్లో ఎవరితోనో శారీరక హింసకు గురికాబడిన టైపు లో ఇచ్చిన స్టిల్ బాగా వైరల్ అయ్యింది. ఆడై థీమ్ ఏంటో దాంట్లోనే చెప్పే ప్రయత్నం చేశారు
ఇప్పుడీ ఆడై విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి అధికారులు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలు చూసేందుకు ఇందులో కంటెంట్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కట్స్ ఇచ్చాక కూడా అదే ఫిక్స్ చేశారు. దీనికి దర్శక నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి.
సోషల్ మెసేజ్ తో తీసిన ఆడైకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే అందులో బోల్డ్ కంటెంట్ ప్లస్ వయోలెన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అని అప్పుడే చర్చ మొదలైపోయింది. మీయదా మాన్ దర్శకత్వం వహించిన ఆడైలో రివెంజ్ ఫార్ములాని చాలా హింసాత్మకంగా తీర్చిదిద్దినట్టు తెలిసింది. అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారట. తెలుగులో డబ్బింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా నిర్మాత ఎవరో కొలిక్కి రాలేదు