హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన అమల పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. సినిమాల్లో కనిపించకున్నా కూడా నాగార్జున భార్య అవ్వడం వల్ల ఆమె ఎప్పుడు మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. ఆమద్య లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో అమ్మ పాత్రలో నటించారు. మళ్లీ పెద్దగా ఆమె నటనపై ఆసక్తిని కనబర్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకు శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఒక ద్వి భాష సినిమాలో అమ్మ పాత్రను చేసేందుకు ఒప్పుకుంది. శర్వానంద్ కు అమ్మగా అక్కినేని అమల నటించారు.
శర్వానంద్ ఇప్పటికే శ్రీకారం పూర్తి చేశాడు. తాజాగా తన 30వ సినిమాను కూడా ముగించేశాడు. తెలుగు మరియు తమిళంలో రూపొందుతున్న ఆ సినిమాకు శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మదర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ కు అమ్మగా అమల నటించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాను శర్వా చాలా సైలెంట్ గా ముగించేశాడు. ఈ సినిమా తర్వాత ప్రారంభం అయిన మహా సముద్రం మరియు ఆడళ్లు మీకు జోహార్లు సినిమా పై జనాల్లో చర్చ జరిగింది. కాని మదర్ సెంటిమెంట్ మూవీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. శ్రీకారం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే ఈ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కినేని అమల నటించిన సినిమా అవ్వడంతో సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉండటం ఖాయం.