సినిమా రంగంలో వెబ్ సిరీస్ ల యుగం మొదలైంది. అనతి కాలంలోనే వేగం పుంజుకున్న ఈ వెబ్ సిరీస్ లలో స్టార్లు కూడా నటిస్తున్నారు. కథ, పారితోషికం నచ్చితే చాలు.. ఏ మాత్రం అబ్జెక్ట్ చేయకుండా సైన్ చేసేస్తున్నారు. ప్రస్తుతం తమిళ్ బ్యూటీ అమలాపాల్ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
పవన్ కుమార్ దర్శకత్వంలో గతంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూటర్న్.’ బాక్సాఫిస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టిన ఈ మూవీ.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా తర్వాత హీరోయిన్ అమలాపాల్ ను మెయిన్ లీడ్ గా పెట్టి ఓ వెబ్ సిరీస్ మొదలు పెట్టాడు పవన్ కుమార్.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సిరీస్.. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రానుంది. భారీ బడ్జెట్ తో ‘ఆహా’ ఓటీటీ సంస్థ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. కాగా.. ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా పయనిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తుండడంతో హ్యాపీగా ఉందట అమల.
ఇదిలాఉంటే.. వెబ్ సిరీస్ ల జోరు రానురానూ పెరుగుతోంది. ప్రేక్షకులు అరచేతిలో సినిమాలు చేసేందుకు అలవాటు పడడంతో.. ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. దీంతో.. స్టార్ యాక్టర్లు కూడా డిజిటల్ ఫార్మాట్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.