ఒక బ్రాండ్ జనాల్లోకి వెళ్లాలి అంటే ఖచ్చితంగా ప్రమోషన్ అవసరం.. అమెజాన్ వంటి అంతర్జాతీయ ఈకామర్స్ సంస్థలు పబ్లిసిటీ కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటాయి. స్టార్స్ సూపర్ స్టార్స్ తో తమ సంస్థకు ప్రచారం చేయించుకుంటూ ఉంటాయి. స్టార్స్ సూపర్ స్టార్స్ చేసినా రాని పబ్లిసిటీ కొన్ని సార్లు కొత్త మోడల్స్ తో చేసినా కూడా భారీగా పబ్లిసిటీ వస్తుంది. ఇక కొన్ని కమర్షియల్ యాడ్స్ నవ్వు తెప్పిస్తే.. కొన్ని కమర్షియల్ యాడ్స్ కన్నీరు పెట్టించే విధంగా కూడా ఉంటాయి. మరి కొన్ని మాత్రం మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మొత్తానికి కమర్షియల్ యాడ్స్ కాన్సెప్ట్ లు కొన్ని సార్లు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. దీపావళి సందర్బంగా అమెజాన్ ఇండియా వారు విడుదల చేసిన ఒక కమర్షియల్ యాడ్ ఇప్పుడు అందరి మనసుకు హత్తుకుంటుంది.
ఈ యాడ్ తల్లి కొడుకు కారులో వెళ్తుండగా స్టార్ట్ అవుతుంది. వారు అమెజాన్ గిఫ్ట్ బాక్స్ ను ఒక వ్యక్తికి ఇచ్చేందుకు వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది కొడుకుకు తెలియదు. ఎవరి కోసం ఈ గిఫ్ట్ అంటూ పదే పదే ఆ తల్లిని అడుగుతాడు. కాని ఆ తల్లి మాత్రం వెళ్తున్నాం కదా చూద్దువులే అంటూ అలాగే తీసుకు వెళ్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్లని ఇంటికి తల్లి కొడుకులు చేరుకుంటారు. తల్లి ఆ ఇంటికి తీసుకు వెళ్లడం కొడుక్కు ఇష్టం లేనట్లుగా పక్కన నిలుస్తాడు. అప్పుడే ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టి తల్లి లోపలి వారిని పిలుస్తుంది. ఇప్పుడైనా చెప్పమ్మా ఎవరిది ఈ ఇల్లు అంటూ ఆ కుర్రాడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ తల్లి అసలు విషయం చెప్పుతుంది.
గత ఏప్రిల్ లో నీకు అనారోగ్యం చేసింది కదా ఆ సమయంలో ఆసుపత్రిల్లో బెడ్ లు ఎక్కడ కూడా దొరకలేదు. ఏం చేయాలో పాలుపోక మేము ఏడుస్తూ ఉన్న సమయంలో ఈయనే నీకు బెడ్ ఇచ్చాడు అంటూ చెప్తుంది. అంతలో అవతలి నుండి ఒక ముసలి వ్యక్తి డోర్ తీస్తాడు. పరిచయం చేస్తుండగానే నీవు ఎందుకు తెలియదు తెలుసు అన్నట్లుగా ఆప్యాయంగా హత్తుకుంటాడు. అలా లోనికి వెళ్లిపోతారు. కరోనా సమయంలో బెడ్ లు దొరకని పరిస్థితుల్లో ఆదుకున్న వారిన ఈ దీపావళి సందర్బంలో గుర్తు చేసుకుని వారికి ఒక మంచి బహుమానం ఇచ్చి కొద్దిలో కొద్దిగా అయినా రుణం తీర్చుకోవాలి అనేది ఈ కమర్షియల్ యొక్క అర్థం. కరోనా పదం పలకకుండానే ఆ భయానక పరిస్థితుల్లో కనీసం బెడ్ లు కూడా దొరక్క పడ్డ ఇబ్బందులను ఈ కమర్షియల్ గుర్తు చేసింది అనడంలో సందేహం లేదు.
Full View
Full View Full View Full View Full View Full View Full View