సైరా.. యూట్యూబ్ రికార్డులు ఎలాగబ్బా

Update: 2018-03-07 23:30 GMT
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఓ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే.. అందుకు అఫీషియల్ ఛానల్ లో యూట్యూబ్ రికార్డుల లెక్కను పరిగణలోకి తీసుకుంటున్నారు. వేర్వేరు ప్రమాణాలు దాటిపోయి.. ఇప్పుడు డిజిటల్ వెర్షన్ లో యూట్యూబ్ వ్యూస్ అండ్ లైక్స్ వరకూ లెక్కలు చేరుకున్నాయి.

కానీ.. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి విషయంలో.. యూట్యూబ్ రికార్డుల మాట వినిపించకపోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను 30 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశారనే వార్తలు వచ్చాయి. అయితే.. సినిమాను మాత్రమే కాకుండా.. సైరా టీజర్.. ట్రైలర్ సహా అమెజాన్ కి హోల్ సేల్ గా అమ్మేశారని అంటున్నారు. అంటే యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ నేరుగా విడుదల కాదు. అమెజాన్ నుంచి కాపీ చేసి.. యూట్యూబ్ లో ఎవరైనా పోస్ట్ చేసినా అవేమీ లెక్క లోకి రావు. ఓ రకంగా చూస్తే.. యూట్యూబ్ రికార్డులు అనే మాటకు సైరా సినిమాతో చెక్ పడిపోయినట్లే అంటున్నారు.

సైరా నరసింహా రెడ్డి టీజర్ నో.. ట్రైలర్ నో ఎంతమంది చూశారో తెలియాలంటే.. అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఎంత లెక్క చెబితే అంత రాస్కోక తప్పదు. నిజానికి అమెజాన్ కు కావాల్సింది కూడా ఇదే. అందుకే టాలీవుడ్ మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ కూడా నటించనున్న సైరాను ఎంచుకుని మరీ.. భారీ బెట్టింగ్ చేసేశారు. సైరా లాంటి భారీ సినిమాకు యూట్యూబ్ రికార్డుల మాట వినిపించడం మానేసిన తర్వాత.. ఈ జాబితాలో మరిన్ని మూవీస్ చేరడం ఖాయం. ఎందుకంటే ఆయా నిర్మాతలు అయినా.. నేరుగా వచ్చే సొమ్మును వద్దనుకోరు కదా. మొత్తానికి డిజిటల్ కంటెంట్ విషయంలో సైరా.. కొత్త ట్రెండ్ సృష్టించబోతోందన్న మాట.



Tags:    

Similar News