మెల్లగా డిజిటల్ ప్రభావం ఒక కొలిక్కి వస్తోంది. తెలుగు సినిమాలు ఏవైనా సరే రెండు నెలల తర్వాతే శాటిలైట్ తో సహా డిజిటల్ సైట్స్ కు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ దీని వల్ల ఏ మేరకు మెరుగైన వసూళ్లు పెంచుకుంటుందో వేచి చూడాలి. అయితే సినిమా ప్రారంభంలో అమెజాన్ లోగో ని హై లైట్ చేయకూడదు అనే చర్య మాత్రం అమలు కాలేదు. మజిలీ-చిత్రలహరి రెండింటికి టైటిల్ కార్డ్స్ లో ముందు పడింది ఇదే.
ఇదిలా ఉండగా రజనీకాంత్ 2.0 ఈ నెల 24న అమెజాన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ లో రానుంది. గత వారం తమిళ్ లో మొన్న శనివారం తెలుగులో శాటిలైట్ ద్వారా జీ ఛానల్ ప్రసారం చేసేసింది. ఇక హిందీ కూడా ఈ వారంలో వేస్తున్నారు. అమెజాన్ లో 24 నుంచి అందుబాటులో ఉంటుంది. అంటే విడుదలైన 100 రోజుల తర్వాత చాలా తాపీగా వదిలారన్న మాట. ఇక జనవరిలో వచ్చిన పేట కూడా ఇదే తరహాలో ఫైనల్ రన్ మొత్తం పూర్తయ్యాక సన్ టీవీలోనూ తన యాప్ లో పెట్టింది
హిందీలో సైతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన గల్లీ బాయ్ ని రేపు అంటే యాభై రోజుల తర్వాత ప్రైమ్ లో పెడుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే ఒక్క తెలుగు సినిమాల విషయంలోనే 30 రోజులు కాల పరిమితితో మనవి అమ్మేశారన్న మాట.
అందుకే ఎన్టీఆర్ రెండు భాగాలూ ఎఫ్2 కేవలం 30 రోజులకే వచ్చేశాయి. ఎఫ్2 వసూళ్ల మీద ప్రభావం పడింది కూడా. సరే ఇప్పటికైనా మేల్కొని 60 రోజుల నిబంధన తెచ్చారు. ఎంతో కొంత లాభం రాకపోదు. తమిళ్ నిర్మాతలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అమెజాన్ లాంటి సంస్థలు ఎంత టెంప్ట్ చేస్తున్నా నిడివి విషయంలో వెనక్కు తగ్గడం లేదు. మనవాళ్ళూ దీన్ని అలవరుచుకున్నట్టే