మొన్న సోమవారం రంగస్థలం ఒరిజినల్ వెర్షన్ ఆన్ లైన్ లో అధికారికంగా విడుదల అయ్యాక వసూళ్లు గణనీయంగా పడిపోతాయేమో అనుకున్నారు కాని ఆ ప్రభావం అంతగా కనిపించడం లేదు. కారణం దీన్ని రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ కు ఇంకా యు ట్యూబ్ అంత ఆదరణ లేదు. ఇంకా ఇది ఎదుగుదల స్థితిలోనే ఉంది. కాని కొత్త సినిమాలు తక్కువ టైంలో పెట్టేస్తున్నారు అనే కారణం మీద దీనికి సబ్ స్క్రైబ్ అవుతున్న వాళ్ళ సంఖ్య బాగానే ఉంది. అమెజాన్ ప్రైమ్ ఇలా ఆన్ లైన్ లో తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ చేయటం మొదలు పెట్టి ఏడాదికి పైగానే అవుతోంది. ఇప్పుడు అందరికి కలుగుతున్న అనుమానం ఒక్కటే. అసలు అమెజాన్ ప్రైమ్ లో ఎంత మంది ఫలానా సినిమాను చూస్తున్నారు అనే లెక్కలు బయటికి ఎందుకు చెప్పడం లేదు అని. యు ట్యూబ్ లో అయితే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎందరు లైక్స్ కొట్టారు డిజ్ లైక్స్ ఎన్ని వచ్చాయి అని స్పష్టంగా చూసుకోవచ్చు. ఫేస్ బుక్ లో సైతం వ్యూస్ లైక్స్ కౌంట్ క్లియర్ గా ఉంటుంది.
కాని అమెజాన్ ప్రైమ్ లో మాత్రం అలాంటి ఆప్షన్స్ ఉండవు. స్ట్రీమింగ్ మొదలు పెట్టాక ఎవరికి వాళ్ళు విడివిడిగా చూసుకోవాల్సిందే తప్ప ఖచ్చితమైన లెక్క మాత్రం అందులో ఉండదు. మెగా ఫాన్స్ ఆ కౌంట్ చెప్పాలని కోరుతున్నారు. రంగస్థలం ఆన్ లైన్ లో ఖచ్చితంగా రికార్డు సృష్టించే ఉంటుందని అది చెప్తే సంతోషిస్తామని అడుగుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కాని ఒకవేళ సదరు సంస్థ ఈ వివరాలు కూడా బయట పెడితే ఇకపై అమెజాన్ ప్రైమ్ ని కూడా వేదికగా చేసుకుని మా హీరో సినిమాని ఎక్కువ చూసారంటే మా హీరో సినిమాని ఎక్కువ చూసారంటూ కొత్త మాటల యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు. కాని అమెజాన్ వద్ద అలాంటి ప్రణాళిక ఏది ఉన్నట్టు కనిపించడం లేదు. డిజిటల్ కంటెంట్ విషయంలో చాలా కఠినంగా నిబంధనలు పెట్టుకున్న అమెజాన్ చూడడానికే తప్ప శాశ్వతంగా స్టోర్ చేసుకునే విధంగా డౌన్ లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం లేదు. అందుకే ఇది లేని వాళ్ళు వేరే ఆప్షన్స్ మీద ఆధారపడుతున్నారు. సో రంగస్థలం ఆన్ లైన్ రికార్డు తెలిసే అవకాశం తక్కువే. మరో రెండు వారాల తర్వాత భరత్ అనే నేను కూడా దీని ద్వారానే ఆన్ లైన్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది. డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.