ఓటీటీలోనే వెంకీ `దృశ్యం-2` ట్రీట్

Update: 2021-11-09 07:32 GMT
విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో `దృశ్యం-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తిచేసుకుని సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. అయితే థియేట‌ర్లో రిలీజ్ చేయాలా? ఓ టీటీలో రిలీజ్ చేయాలా? అన్న దానిపై ఇంకా క్లారిటీ దొర‌క‌లేదు. వెంకీ గ‌త చిత్రం `నారప్ప` ఓటీటీలో రిలీజ్ అయి పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేట‌ర్లో రిలీజ్ చేయ‌లేదు అన్న అంశంపై ఎగ్జిబిట‌ర్లు కాస్త హ‌డావుడి చేసినా కొవిడ్ పేరుతో ఓటీటీలోకి తొసేసారు. ఈ నేప‌థ్యంలో `దృశ్యం-2`నైనా థియేట‌ర్లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఏదైనా ఉందా? అంటే ఆ ఛాన్స్ ఎంత మాత్రం లేద‌ని తెలుస్తోంది.

నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీన్ని రిలీజ్ చేయాల‌ని సురేష్ బ‌బు సద‌రు సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్న‌ట్లు గ‌నుక జ‌రిగితే ఈ క్రిస్మ‌స్ కానుక‌గా ఓటీటీలో దృశ్యం-2 సంద‌డి చేయ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి సురేష్ బాబు థియేట‌ర్ రిలీజ్ కి ఎందుకు వెళ్ల‌న‌ట్లు? అంటే చాలా సంగ‌తులే ఉన్నాయి. ఈ చిత్రాన్ని చాలా త‌క్కువ ధ‌ర‌కే కోట్ చేసిన‌ట్లు...అలాగే డిజిట‌ల్ రైట్స్ కూడా ఆయ‌న అంచ‌నాకు రీచ్ అవ్వ‌క‌పోవ‌డంతో ఓటీటీనే బెట‌ర్ అనే ఛాయిస్ తీసుకున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఓటీటీతో ముందుగానే ఒప్పందం చేసుకుని ప్రాడ‌క్ట్ ని అమ్మేస్తే త‌ర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చినా నిర్మాత సేఫ్ గా ఉండొచ్చు! అన్న థాట్ తో ఓటీటీకి వెళ్లిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే కోలీవుడ్ హీరోలు సూర్య‌...ధ‌నుష్ లాంటి హీరోలు త‌మ సినిమాల్ని ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రోడ‌క్ట్ పై సందేహం ఉన్న చిత్రాల‌న్నింటి విష‌యంలో ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు ఈ విధంగానే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సురేష్ బాబు కూడా ఓటీటీ నుంచి మంచి ఆఫ‌ర్ రావ‌డంతోనే `దృశ్యం-2`ని అమెజాన్ లో రిలీజ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లుత తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో థియేట‌ర్లు తెరుచుకున్నా ఫ్యామిలీ ఆడియ‌న్స్థియేట‌ర్ కి రావ‌డానికి ఆస‌క్తి చ‌పించ‌లేదు. ఓటీటీలోనే ఎంట‌ర్ టైన్ మెంట్ ని వెతుక్కుంటున్నారు. ఆ కార‌ణంగాను సురేష్ బాబు మొద‌టి ఛాయిస్ ఓటీటీ అవ్వొచ్చు.




Tags:    

Similar News