ఐమ్యాక్స్ కి ఇన్నాళ్టికి గ‌ట్టి పోటీ

Update: 2018-12-14 04:31 GMT
ప్ర‌పంచంలోనే అతి పెద్దదైన‌ ఐమ్యాక్స్ స్క్రీన్ ఉన్న థియేట‌ర్ హైద‌రాబాద్ లో ఒక‌టే ఉంది. ఇది వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 2 అన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్క్రీన్ లో చూస్తేనే 3డి సినిమాల‌కు కిక్కు. రెగ్యుల‌ర్ 3డి స్క్రీన్ల‌తో పోలిస్తే ఇక్క‌డ చూసిన వారికి ఏకంగా తాము వేరొక గ్ర‌హంలో ఉన్నామా? అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. అవ‌తార్ లాంటి సినిమా ఏడాది పైగా ఆడిందంటే అందుకు కార‌ణం కూడా ఆ గొప్ప అనుభూతి. అందుకే ప్ర‌సాద్ ఐమ్యాక్స్ స్క్రీన్ అంటే తెలుగు ఆడియెన్ కి - న‌గ‌ర‌వాసుల‌కు ఎంతో మ‌క్కువ‌. ఇక చుట్టుప‌క్క‌ల‌ ఊళ్ల నుంచి వ‌చ్చిన వాళ్లు సైతం ఇందులో ఏదైనా 3డి సినిమా ఆడుతుంటే చూడాల‌న్న త‌ప‌న‌తో వ‌స్తుంటారు. అంతెందుకు ఏపీ నుంచి వ‌చ్చే ఎంతో మంది ఐమ్యాక్స్ స్క్రీన్‌ లో సినిమా చూడాల‌న్న త‌ప‌న‌తో రావ‌డం వ‌ల్ల ఎప్పుడూ ఇక్క‌డ క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది.

కానీ ఇక‌పై ఆ క‌ళ త‌గ్గ నుందా?  అందుకు ఏఎంబీ సినిమాస్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. గ‌చ్చిబౌళి కొత్త గూడ ప‌రిస‌రాల్లో అత్యంత ల‌గ్జ‌రీగా వ‌ర‌ల్డ్ స్టాండార్డ్స్ తో నిర్మించిన ఏఎంబీ సినిమాస్ లో ఫెసిలిటీస్.. రిచ్ యాంబియెన్స్ తో పాటు ఐమ్యాక్స్ స్క్రీన్‌ ని మించిన వైబ్రెంట్ అప్పియ‌రెన్స్ తో ఒక పెద్ద స్క్రీన్ ఆక‌ట్టుకుంటోంద‌ట‌. ఏడు స్క్రీన్ల‌లో ఒక స్క్రీన్ ని అతి పెద్ద‌గానూ డిజైన్ చేయ‌డంతో ఇందులో 3డి సినిమా ఎక్స్‌ పీరియెన్స్ ఆడియెన్ ని మెస్మ‌రైజ్ చేస్తోంద‌ని తెలుస్తోంది.

పైగా ఏఎంబీ సినిమాస్ కి న‌మ్ర‌త శిరోద్క‌ర్ చేస్తున్న ప్ర‌చారం మామూలుగా లేదు. సినిమావాళ్లంద‌రి ప్రివ్యూలు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని ఏఎంబీ మాల్‌ లోనే పెట్టేస్తున్నారు. 2.0 ప్రీమియ‌ర్ మొద‌లు రోజుకో సినిమా ప్ర‌చారం ఇక్క‌డ సాగుతోంది. నిన్న‌గాక మొన్న `అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్` ట్రైల‌ర్ ని ఇక్క‌డే వేశారు. భైర‌వ‌గీత ప్రివ్యూ స‌హా ఇక‌పై సినిమాల ప్రివ్యూల‌న్నీ ఇక్క‌డే వేస్తున్నారు. దీంతో ఐమ్యాక్స్ కి ట్రాఫిక్ త‌గ్గి గ‌చ్చిబౌళికి ఇంకా ట్రాఫిక్ పెరిగింద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. మొత్తం మీద మ‌హేష్ - న‌మ్ర‌త‌ల స్కెచ్ మామూలుగా లేదు. హైద‌రాబాద్ బెస్ట్ అనిపించిన ఐమ్యాక్స్ కే పెద్ద థ్రెట్ ని త‌యారు చేశార‌న్న‌మాట‌. ఏఎంబీ సినిమాస్ రిక్లెయిన‌ర్ సీట్లో కూచుని 360 డిగ్రీలు తిరిగేస్తూ పాప్ కార్న్ తింటూ సినిమాలు చూసేందుకు సాఫ్ట్ వేర్ బాబులు ఆస‌క్తి చూపిస్తున్నార‌న్న‌ది తాజా అప్ డేట్.
   

Tags:    

Similar News