45 ఏజ్ లోనూ మంట‌లు పెడుతున్న బ్యూటీ

Update: 2021-05-25 11:30 GMT
వ‌య‌సుతో ప‌నేం ఉంది మ‌న‌సుండాలే కానీ..!  బాలీవుడ్ లో లేట్ ఏజ్ క‌థానాయిక‌ల తీరుతెన్నుల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. మ‌లైకా - శిల్పా శెట్టి- క‌రిష్మా .. వీళ్ల‌తో పాటు బాలీవుడ్ స్టార్ వైవ్స్ ఎవ‌రైనా త‌మ విలాస‌వంత‌మైన జీవితానికి కించిత్ భంగ‌పాటును కూడా స‌హించ‌రు. ఫేజ్ 3 ప్ర‌పంచంలో ఆస్వాధ‌న‌ల‌కు ఏమాత్రం అవ‌కాశం చిక్కినా వ‌దిలి పెట్ట‌రు. పార్టీ క‌ల్చ‌ర్ ని విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేదు.

ఇప్పుడు అదే కేట‌గిరీలో బ‌ద్రి భామ అమీషా ప‌టేల్ గ్లామ‌ర‌స్ వైబ్స్ ప్ర‌తిసారీ యువ‌త‌రంలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.  ఓవైపు ఏజ్ 45 ప్ల‌స్ .. కానీ పార్టీ క్రౌడ్స్ లో నిరంత‌రం ఈ బ్యూటీ చిలౌట్ చేస్తూనే ఉంటుంది.

ఈ భామ ఇటీవ‌ల‌ వ‌యసుతో సంబంధం లేకుండా వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ద‌డ పుట్టిస్తోంది. లేట్ ఏజ్ తెలిసిపోతున్నా అమీషా మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఇంత‌కుముందు ఈ బ్యూటీ రేస్ 2లో న‌టించిన‌ప్పుడే ఏజ్ ప్ర‌భావం క‌నిపించింది. కానీ ఆ త‌ర్వాత కూడా ఇంకా రంగుల ప్ర‌పంచంలో కుర్ర‌హీరోయిన్ల‌తో పోటీప‌డేందుకు త‌న‌వంతుగా త‌పిస్తూనే ఉంది. కానీ బాలీవుడ్ లో అవ‌కాశాలు ద‌క్క‌డం లేదు. ఇటీవ‌లే ఓ బిజినెస్ మేన్ తో అమీషా ఘ‌ర్ష‌ణ ప‌డ‌డం చెక్ బౌన్స్ కేసుల గురించి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం పంజాబీ చిత్రాల్లో అమీషా బిజీ అవుతోంది.  దేశీ మ్యాజిక్ .. ది గ్రేట్ ఇండియన్ కేసినో- తౌబా తేరా జ‌ల్వా- ఫౌజీ వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. వీటిలో దేశీ మ్యాజిక్ చిత్రాన్ని అమీషా స్వ‌యంగా నిర్మిస్తోంది.
Tags:    

Similar News