'బ‌ద్రి' నాయిక‌ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ ట్రీట్

Update: 2022-07-30 05:53 GMT
అమీషా ప‌టేల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌ర‌స‌న బద్రి చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన ఈ అమ్మ‌డు హృతిక్ స‌ర‌స‌న 'క‌హోనా ప్యార్ హై' చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. ఇటీవ‌ల ఏజ్ ఫ్యాక్ట‌ర్ అమీషాను బాగా ఇబ్బంది పెడుతోంది. బాలీవుడ్ లో ఆశించిన అవ‌కాశాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మవుతోంది. అదే క్ర‌మంలో  సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో దుమ్ము రేపుతోంది.

ఈ బ్యూటీ నిరంత‌ర బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి యువ‌త‌రంలో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. నెవ్వ‌ర్ బిఫోర్ కిల్లింగ్ లుక్ తో అమీషా త‌న ఫాలోవ‌ర్స్ ని మంత్ర ముగ్దుల‌ను చేస్తోంది. తాజాగా మ‌రో హాట్ బెడ్ రూమ్ ఫోటోషూట్ ని అమీషా షేర్ చేయ‌గా ఇంట‌ర్నెట్ ని బ్రేక్ చేస్తోంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అమీషా అభిమానులు  ఒక రేంజులో కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. లేట్ ఏజ్ లో ఘాటు అందాలు! అంటూ హాట్ కంటెంట్ ని పొగిడేస్తూ కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. అన్న‌ట్టు అమీషా ఏజ్ లెస్ బ్యూటీగా చెల‌రేగిపోతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అమీషా వ‌య‌సు 46.. మ‌లైకా కంటే రెండేళ్లు చిన్న‌ది. కానీ ఎక్స్ పోజింగ్ లో మ‌లైకాతోనే పోటీప‌డుతోంది.

అమీషా ప్ర‌స్తుతం 'ద గ్రేట్ ఇండియా క్యాసీనో'.. దేశీ మ్యాజిక్ చిత్రాల్లో న‌టిస్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ గ‌ద్ద‌ర్ సీక్వెల్లోనూ త‌న పాత్ర‌కు కొన‌సాగింపు అవ‌కాశం ద‌క్కించుకుంది. మిస్ట‌రీ ఆఫ్ టాటూ అనే చిత్రంలోనూ ఈ బ్యూటీ న‌టిస్తోంది.

ఇంత‌కుముందు 'బ‌ద్రి' సినిమాతో ఆమె తెలుగులో అడుగు పెట్టిన ఆ త‌ర్వాత మ‌హేష్ స‌ర‌స‌న‌ 'నాని' లో న‌టించింది. కానీ స‌క్సెస్ లేక‌ టాలీవుడ్ లో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

అయితే అమీషా ప‌టేల్ (46) తొలి నుంచి  బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. అక్క‌డ కూడా  కెరీర్ ప‌రంగా ఆశించిన స్టార్ డ‌మ్ అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం పంజాబీ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.
Tags:    

Similar News