సెలబ్రిటీలు ఒంటరి దీవులకు జంటగా ఎగిరిపోవడం ఇటీవల చూస్తున్నదే. అందాల భామలు బిజీ లైఫ్ నుంచి రిలీవ్ అయ్యి ఒత్తిడిని అధిగమించేందుకు జంట షికార్లు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ పెళ్లయితే ఓకే కానీ పెళ్లి కాకపోతే బోయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా జంప్ చేసేస్తూ అక్కడి నుంచి కొన్ని ఫోటో లీకులిచ్చి కుర్రకారును తెగ సతాయిస్తున్నారు. బీచ్ లొకేషన్ స్వేచ్ఛ స్వాతంత్య్రం అనగానే తొలిగా గుర్తొచ్చేది బాలీ లొకేషన్. బాలీ దీవుల్లో అదిరిపోయే బీచ్ లు ఉన్నాయి. మరో పండోరా గ్రహం మీంచి సాగర తీరంలోకి అడుగు పెట్టిన ఫీల్ కలుగుతుందని సందర్శకులు చెబుతుంటారు.
ముఖ్యంగా అక్కడ కెలింగ్ కింగ్ బీచ్ .. నుసా పెనిడ అనేది చాలా ఫేమస్. అక్కడికి ఇప్పటికే ఎందరో టాలీవుడ్ సెలబ్రిటీలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడం చూశాం. తాజాగా కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ కెలింగ్ కింగ్ బీచ్ విహారానికి వేంచేసింది. అక్కడ ఈ అమ్మడి జాలీ ట్రిప్ ఏ రేంజులో ఎంజాయ్ చేసిందో .. ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పేయొచ్చు.
బ్యాక్ లెస్ లో బీచ్ తీరాన ఏకాంతంగా కనిపించింది. సముద్రుడినే లాలనగా చూస్తూ అలా ఉండిపోయింది. సముద్రుడికైనా మతిచెడే ఈ అందం ఇలా ఏకాంతంలో ఎవరిని తలుచుకుందో కానీ.. ఆ ఫోజు చూశాక సముద్రుడికైనా మతి భ్రమించదా? అంటూ బోయ్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. బ్లూ స్కైస్.. డెనిమ్ షార్ట్స్ .. సాల్టీ టాన్! అంటూ పోయెట్రీ బాగానే చెప్పింది కానీ.. బాలీ ట్రిప్ లో బోయ్ ఫ్రెండ్ ఎవరో మాత్రం చెప్పనే లేదు ప్రగ్య. ఈ అమ్మడి అందం సముద్రం చందం... అంటూ... ప్రిన్సెస్ ని తలపిస్తోందంటూ ఎవరికి వారు ఊహాగానాల్లో తేలిపోతున్నారు. ఒక అభిమాని అయితే ఏకంగా ఇన్ స్టా ప్రేమకవితనే తనకు కానుకగా పంపాడు. ``నా జీవితంలో నువ్వే నా సంతోషం. నా పెదవులపై నవ్వే నువ్వు.. నిన్ను చూసేందుకే ఇంకా బతికి ఉన్నా. నీ క్యూట్ స్మైల్ నాలో పవర్ నింపుతుంది.. నన్ను వదిలి ఎటూ వెళ్లకు!`` అంటూ ఎంతో ఆరాధనగా కవిత అల్లాడు పాపం! ఇలా ఇన్ స్టాలోకి వచ్చిందో లేదో అలా ఫ్యాన్స్ లో వైరల్ అయిపోయింది ఈ ఫోటో. అంత ఇదిగో కవ్విస్తోంది మరి. అన్నట్టు సినిమాల్లేక ఇలా షికార్లు ఎన్నాళ్లని? ప్రగ్య ఎప్పటికి బిజీ అవుతుందో?