మెగా బ్ర‌ద‌ర్స్ రీమేక్ తంతు..అక్క‌డ నీర‌సం తెప్పిస్తుందా?

Update: 2022-03-19 08:45 GMT
డే బై డే టాలీవుడ్ రూపం పూర్తిగా మారిపోతుంది. హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా కేట‌గిరిలో ఫేమ‌స్ అవ్వాల‌ని  చూస్తున్నారు. ఆ ర‌క‌మైన కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.` బాహుబ‌లి`తో మొద‌లైన ఈ సంస్కృతిపైనే హీరోలంతా క‌న్నేసి ముందుకెళ్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌-జూనియ‌ర్  ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఏకంగా నాలుగేళ్లు `ఆర్ ఆర్ ఆర్` కోసం కేటాయించారంటే వాళ్ల‌లో పాన్ ఇండియా క‌సి ఏ స్థాయిలో ఉందో అర్ధ‌మ‌వుతుంది. త‌దుప‌రి చిత్రాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా అదే దిశ‌గా అడుగులు వేస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే.

రాజ‌మౌళితో ఆఫ్రికా  అడ‌వుల బ్యాక్ డ్రాప్ లో తెరెక్కుతోన్న ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నేను సైతం పాన్ ఇండియా స్టార్ అవుతానంటున్నాడు. ఇంకా  కొంత మంది హీరోలు సైతం పాన్ ఇండియా కంటెంట్ కోసం వెంప‌ర్లాడుతున్నారు. ఇక్క‌డ వ‌చ్చిన స‌మ‌స్య అల్లా పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ లేక‌పోవ‌డ‌మే. ఎటు చూసినా అంద‌రికీ రాజ‌మౌళి ఒక్క‌టే క‌నిపిస్తున్నాడు. ఏదో ఒక డైరెక్ట‌ర్ తో అలాంటి సాహ‌సం చేసేద్దాం? అంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కొంత మంది హీరోలు ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాల‌కు దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ల‌కి అటు ఇటుగా మెగా బ్ర‌ద‌ర్స్  చిరంజీవి-ప‌వ‌న్ కి కూడా ఉద‌హ‌రించ వ‌చ్చు. చిరంజీవి-ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల గురించి ప్ర‌స్తావిస్తే ఈ ఇద్ద‌రు హీరోలు  కొంత కాలంగా రీమేక్ ల‌పైనే ప‌డి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చిరంజీవి కంబ్యాక్ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150 ` కోలీవుడ్ `క‌త్తి` రీమేక్. ఆ త‌ర్వాత  మెగాస్టార్ ఎంచుకున్ క‌థాంశాల‌న్నీ కూడా సేఫ్ జోన్ లో కే వ‌స్తాయి. `సైరా న‌ర‌సింహారెడ్డిగానీ...ప్ర‌స్త‌తుం చేస్తోన్న `గాడ్ ఫాద‌ర్`..`భోళా శంక‌ర్ `. ఈ రెండు కూడా ఇత‌ర భాష‌ల రీమేక్ చిత్రాలే. అలాగే ` ఆచార్య` వెనుక అప‌జ‌యం ఎరుగ‌ని మేక‌ర్ కొర‌టాల శివ ఉన్నాడు. ఇటీవ‌లే మ‌రో మ‌యాళం సినిమా `బ్రోడాడీ` రీమేక్ పైనా మెగాస్టార్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం.

ఇక ప‌వ‌న్ విషయానికి వ‌స్తే ఆయ‌న కొన్నాళ్ల‌గే రీమేక్ ల‌తోనే  ప్రేక్ష‌కుల ముందుక వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం జాబితా చూసిన అదే ట్రాక్ క‌నిపిస్తుంది. తాజాగా త‌మిళ సినిమా `వినోద‌య సీత‌మ్` కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.  ఈ సినిమాకి డేట్లు కూడా కేటాయించిన‌ట్లు స‌మాచారం.  మార్చి 24 -25  తేదీల్లో సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుందిట‌. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారింభిస్తారుట‌.  ఇలా మెగా బ్ర‌ద‌ర్స్ వ‌రుస‌గా రీమేక్ ల్లో న‌టించ‌డంపై ఓవ‌ర్సీస్ నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్  పై ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా  క‌నిపిస్తుంది.

వ‌రుస‌గా రీమేక్ సినిమాల్లో మెగా బ్ర‌ద‌ర్స్ న‌టించ‌డం  `కొత్త బాటిలో లో పాత సారా` పోసిన‌ట్లు క‌నిపిస్తుంద‌న్న విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. చిరంజీవి-ప‌వ‌న్ స‌మ‌కాలీకులు అంతా అప్డేడేటెడ్ వెర్ష‌న్ గా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంటే..మెగా బ్రదర్స్ ఆర‌క‌మైన సాహ‌సానికి పూనుకోకుండా సేఫ్ గేమ్ ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ముఖ్యంగా ఆమెరికా మార్కెట్ నుంచి  మెగా బ్ర‌ద‌ర్స్  రిమేక్  రిపోర్ట్ ఏమంత ఆశాజ‌నకంగా లేదు. చూసేసిన క‌థ‌ల్లో వేరే హీరోని మ‌ళ్లీ ఓన్ చేసుకోవడం క‌ష్ట‌మ‌వుతుంద‌నే నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. స్థానికంగా రీమేక్ క‌థ‌లు మెగా బ్ర‌ద‌ర్స్ కి  వ‌ర్కౌట్ అవుతున్నా అమెరికా మార్కెట్ పై మాత్రం ప్ర‌తికూల‌త కనిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌తికూల‌త‌ని మెగా బ్ర‌ద‌ర్స్ ఎలా త‌మ‌కి  అనుకూలంగా మార్చుకుంటారో వేచి చూడాలి.
Tags:    

Similar News