జాతీయ సినిమా దినోత్సవం చౌకైన టిక్కెట్ రేట్లు ప్రేక్షకులను గుంపులుగా సినిమా హాళ్లకు లాగగలవని పరిశ్రమకు అర్థమయ్యేలా చేసింది. సెప్టెంబర్ 23న దీనిని పురస్కరించుకుని టిక్కెట్లను కేవలం రూ. 75కే విక్రయించడం సినిమా హాళ్లకు కొత్త కళ తెచ్చింది. కలెక్షన్ల పరంగా బాగా కలిసొచ్చింది. ఇది బ్రహ్మాస్త్ర వంటి పెద్ద-టికెట్ చిత్రాలకు మాత్రమే కాకుండా చుప్ - ధోఖా రౌండ్ డి కార్నర్ వంటి చిన్న చిత్రాలకు కూడా హౌస్ ఫుల్ షోలను ప్రదర్శించేందుకు స్కోప్ నిచ్చింది. ఆ తర్వాత ఆఫర్ ను వారం రోజులకు పొడిగించారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై టిక్కెట్లు కేవలం రూ. 150కే విడుదల రోజు (అంటే శుక్రవారం అక్టోబర్ 7) విక్రయించారు.
ఇప్పుడు మేకర్స్ మరో అద్భుతమైన ఆఫర్ తో ముందుకు వచ్చారు. అక్టోబర్ 11 మంగళవారం వీక్షకులు గుడ్ బాయ్ ని కేవలం రూ. 80కే టికెట్ కొనుక్కుని చూడొచ్చు. సినిమా ప్రధాన పాత్రధారి అయిన అమితాబ్ బచ్చన్ మంగళవారంతో 80వ ఏట అడుగుపెట్టినందున రూ.80కి టిక్కెట్ ధరలను సవరించి విక్రయించడం గొప్ప ఆలోచన అని మేకర్స్ భావించారు. ఈ రోజున 80కే టికెట్ కొనుక్కోవచ్చు. వారు మల్టీప్లెక్స్ చైన్ లతో మాట్లాడగా ఏకోన్ముఖంగా వారు కూడా ఇది గొప్ప ఆలోచనగా భావించారు. వెంటనే దీనిని అమలు చేసారు. 11వ తేదీకి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
అక్టోబర్ 11న అభిమానుల్లో కోలాహాలం వేరుగా ఉంటుంది. అన్నింటికంటే మహానాయక్ (అమితాబ్)కు 80 ఏళ్లు వస్తున్నాయి. సెంచరీకి 20ఏళ్ల దూరంలో ఉన్నారు ఆయన. ఇక ఈ సందర్భంలోనే గుడ్ బాయ్ కి ఈ అద్భుతమైన ఆఫర్ ను ప్రచారం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది భారీ గా జనాలను థియేటర్లకు తెస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. చౌకైన టిక్కెట్ ధరల ప్రయోజనాన్ని పొందడానికి చాలా మంది ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారని వారు ఆశిస్తున్నారు.
ప్రస్తుతానికి PVR సినిమాస్- ఐనాక్స్- సినీపోలిస్- మీరాజ్- ముక్తా మొదలైన థియేట్రికల్ చైన్ లు ఇప్పటికే టికెట్ తగ్గింపుపై సాలోచనతో ఉన్నాయి. ఇతర మల్టీప్లెక్స్ చైన్ లు.., స్టాండ్ ఎలోన్ సినిమాస్ .. సింగిల్ స్క్రీన్ లు కూడా గుడ్‌బై టిక్కెట్‌లను రూ.80కి తగ్గించి విక్రయించాలని భావిస్తున్నాయి. అక్టోబర్ 11న రూ.80 ధర కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.
కాగా పీవీఆర్ సినిమాస్ లో ‘బచ్చన్ బ్యాక్ టు ద బిగినింగ్’ పేరుతో చిత్రోత్సవం జరుగుతోంది. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ వేడుకలను అక్టోబర్ 8 నుండి 11 వరకు 17 నగరాల్లో నిర్వహిస్తోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా అమితాబ్ బచ్చన్ నటించిన డాన్- కాలా పత్తర్- కాళియా- కభీ కభీ- అమర్ అక్బర్ ఆంథోనీ మొదలైన క్లాసిక్ చిత్రాలను పెద్ద తెరపై ప్రదర్శిస్తున్నారు. అక్టోబర్ 8- 9- 10 తేదీల్లో టిక్కెట్లు రూ. 150 ధర పలికితే 11వ తేదీన టిక్కెట్లను కేవలం రూ. 80కే అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తానికి టిక్కెట్టు ధర తగ్గితే జనం థియేటర్లకు వస్తారని నిరూపణ అవుతుంటే ఇలాంటి కొత్త స్కీమ్ లను నిర్మాతలు ఎగ్జిబిటర్లు తెరపైకి తేవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ధోరణి ఇటు సౌత్ లోనూ మొదలవుతుందని భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.