మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ అలెర్ట్ గా.. స్టెడీగా మారిపోతారు. ఏం కొత్తదనంతో మనల్ని థ్రిల్ చేయబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆమిర్ ఖాన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండండంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుండి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఆమిర్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు.
దానికి 'ది బిగ్గెస్ట్ థగ్ ఆఫ్ ఆల్' (అందరికన్నా పెద్ద బందిపోటు) అనే సూపర్ క్యాప్షన్ ఇచ్చాడు. నడి సముద్రంలో నల్లటి మబ్బులు ముసురుకొని ఉంటే ఒక పక్షి అలా ఎగురుతూ ఒక ఓడ పైకి వస్తుంది.. ఆ ఓడలో ఫిరంగి అంచుపైన వాలుతుంది.. పక్కనే అమితాబ్ బచ్చన్ యుద్దానికి సిద్ధం అన్నట్టుగా ఒక చేత్తో ఖడ్గం తో ఠీవిగా నిలబడి ఉంటాడు. ఫైనల్ గా అమితాబ్ క్యారెక్టర్ పేరు ఖుదాబక్ష్ అని రివీల్ చేశారు. పాతకాలం నాటి ఓడ బ్యాక్ గ్రౌండ్.. పైన కారుమబ్బులు.. ఈ లొకేషన్ తో పాటు బిగ్ బీ గెటప్ అదిరిపోయింది.. తలపాగా.. పొడవాటి జుట్టు.. గెడ్డం మీసాలు.. అసలు అమితాబ్ లుక్ సూపరంటే సూపర్. ఇక అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది.
ఈ సినిమాకు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకడు. 1839 కాలం నాటి 'కన్ఫెషన్స్ ఆఫ్ థగ్' అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ - ఫాతిమా సనా షేక్ - రోనిత్ రాయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నఈ సినిమాను నవంబర్ 8 న దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Full View