బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఆదాయం ఉన్న స్టార్స్ లో ముందు వరుసలో ఉంటాడు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా పదుల సంఖ్యలో ఆయన చేస్తున్న యాడ్స్ రూపంలో కూడా వందల కోట్ల రూపాయల ఆదాయం ఆయనకు వస్తుంది. ఎన్నో వ్యాపారాలు - రాయల్టీలు - పారితోషికంల రూపాల్లో సంవత్సరంలో వందల కోట్ల రూపాయలు అమితాబచ్చన్ సంపాదిస్తున్నారు. అందుకే 2018 మరియు 19 ఆర్థిక సంవత్సరంకు గాను ఏకంగా 70 రూపాయల ఆస్తి పన్నును చెల్లించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
అమితాబచ్చన్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఒక వ్యక్తి ఈ విషయాన్ని వెళ్లడించారు. ప్రభుత్వంకు అమితాబ్ 70 కోట్ల మెగా పన్ను చెల్లించడంతో పాటు ఈ సంవత్సర కాలంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ముజఫర్ నగర్ లోని 2084 మంది రైతుల రుణాలన్నింటిని కూడా పూర్తిగా తానే చెల్లించాడు. బ్యాంకులకు ఇప్పటికే రైతుల రుణం మొత్తంను జమ చేయడం జరిగింది. ఇక పుల్వామా ఉగ్ర దాడిలో మృతి చెందిన వీర సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇంకా ఎన్నో సేవా మరియు స్వచ్చంద సంస్థలకు విరాళాలు కూడా ఇచ్చాడు. ఇంత సేవ చేసినా కూడా తన వద్ద ఉన్న ఆస్తులకు 70 కోట్ల పన్ను కట్టాడు అంటే ఆయన మొత్తం సంపాదన ఎంతో అర్థం చేసుకోవచ్చు.
వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ కూడా తెలుగు మరియు తమిళంలో కూడా ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ వయసులో కూడా పదుల కోట్ల పారితోషికాలు తీసుకుంటున్నట అమితాబచ్చన్ ఇతర స్టార్ హీరోలకు - చిన్న హీరోలకు ఆదర్శనీయుడు అని చెప్పుకోవచ్చు. ఇక పన్ను కట్టడంలో కూడా ఇతర స్టార్స్ కు అమితాబచ్చన్ ఆదర్శనీయుడు. అమితాబచ్చన్ కంటే ఎక్కువ సంపాదించే వారు కనీసం 10 నుండి 20 కోట్ల పన్ను కట్టడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు.