KBC లో కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్..!

Update: 2021-12-05 05:30 GMT
KBC లో కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్..!
  • whatsapp icon
ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ మీద కొన్నేళ్లుగా అత్యంత ప్రజాదరణ పొందుతున్న గేమ్ షో 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి'. బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసిందే. సోనీ టీవీలో ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ ప్రసారం అవుతోంది. అయితే లేటెస్టుగా వచ్చిన ఎపిసోడ్ లో కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.

అత్యంత ప్రాచుర్యం పొందిన 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' షోకు సంబంధించిన 1000వ ఎపిసోడ్ లేటెస్టుగటెలికాస్ట్ అయింది. దీనికి అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ మరియు మనవరాలు నవ్య నవేలి నందా ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబీసీలో బిగ్ బీ జర్నీని గుర్తు చేస్తూ నిర్వాహకులు ఓ స్పెషల్ వీడియోని ప్లే చేశారు. ఇది చూసి అమితాబ్ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ బిగ్ స్క్రీన్ మీద నటించిన స్టార్స్ స్మాల్ స్క్రీన్ మీదకు వస్తే ఇమేజ్ తగ్గిపోతుందని అందరూ అన్నారని తెలిపారు. కానీ ఆ సమయంలో తనకు పెద్దగా పని లేదని.. ఎవరూ తనకు సినిమాలు ఆఫర్ చేయకపోవడంతో 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో చేయడానికి అంగీకరించినట్లు అమితాబ్ వెల్లడించారు.

కేబీసీ గేమ్ షో ఇప్పటికే 12 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోడానికి.. ఈ స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా120 దేశాల్లో విజయవంతమైన ఈ షో.. పలు భారతీయ భాషల్లో రూపొందించారు.

తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా మూడు సీజన్లు.. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఒక సీజన్  నిర్వహించారు. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని 'ఎవరు మీలో కోటీశ్వరులు' పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు.
Tags:    

Similar News