సుశాంత్‌ మరణంతో మెగాస్టార్‌ మనవడి ఎంట్రీ ఆలస్యం?

Update: 2020-07-12 00:30 GMT
బాలీవుడ్‌ లో నెపొటిజం ఏ స్థాయిలో ఉందో సుశాంత్‌ మరణం తర్వాత కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తుంది. బాలీవుడ్‌ కు చెందిన వారు పలువురు బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ వారసులు ఎలా ఆఫర్లు దక్కించుకుంటున్నారో సాక్ష్యాధారాలతో చూపిస్తున్నారు.

స్టార్స్‌ తో ఎక్కువగా సినిమాలు చేసే కరణ్‌ జోహార్‌ పై ట్రోల్స్‌ ఏ స్థాయిలో వస్తున్నాయో తెల్సిందే. అందుకే ఆయన పలు సినిమాలను క్యాన్సిల్‌ చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మనవడు(కూతురి కొడుకు) అయిన అగస్థ్య నంద హీరోగా పరిచయం అవ్వాల్సి ఉండగా ఆలస్యం అవ్వనుందట.

బచ్చన్‌ ఫ్యామిలీ ఈ ఏడాదిలో అగస్థ్య నందను హీరోగా పరిచయం చేయాలని రెండు మూడు సంవత్సరాలుగా చర్చలు జరుపుతున్నారట. ప్రముఖ దర్శకుడు ఇప్పటికే అగస్థ్య కోసం స్క్రిప్ట్‌ రెడీ చేశాడట. మొదట కరోనా ఆ తర్వాత సుశాంత్‌ మరణంతో అగస్థ్య మూవీ ఎంట్రీ పై ప్రభావం చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నెపొటిజం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో అగస్థ్య మూవీ ఎంట్రీ సాధ్యం కాకపోవచ్చు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క సంవత్సరం అయినా అగస్థ్య ఎంట్రీ ఆలస్యం చేసే అవకాశం ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటికే విపరీతమైన క్రేజ్‌ దక్కించుకున్న ఈ బచ్చన్‌ మనవడు 2022 లో ప్రేక్షకుల ముందుకు రావచ్చంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News