యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్నటి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి తారక్ తో పాటు దర్శకుడు రాజమౌళి..రామ్ చరణ్ కూడా ఈభేటీలో పాల్గొనాలిట. కానీ చివరి నిమిషంలో రాజమౌళి డ్రాప్ అయినట్లు సమాచారం. ఇటీవలే స్టార్ రైటర్...రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో సభ్యత్వం కల్పించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలో జక్కన్న హాజరైతే గనుక ప్రభుత్వానికి థాంక్స్ చెప్పినట్లు ఉంటుందని..అది కాస్త పొలిటికల్ గా వెళ్లడానికి అవకాశం ఉంటుందని భావించి చివరి నిమిషంలో రాజమౌళి స్కిప్ కొట్టినట్లు వినిపిస్తుంది.
అలాగే చరణ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో భాగంగా గోవా లో ఉండటంతో ఆయనా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వీళ్లందరి తరుపున మర్యాదపూర్వకంగా తారక్ ఒక్కడే అమిత్ షాని కలిసినట్లు వినిపిస్తుంది.
అయితే తారక్ ఒక్కడే వెళ్లడంతో రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి. కానీ వాటికి ఏమాత్రం ఛాన్స్ లేదని సన్నిహిత వర్గాలు బలంగా చెబుతున్నాయి. పాన్ ఇండియాలో 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ అవ్వడంతో టీమ్ ని విష్ చేసే ఉద్దేశంలో భాగంగానే అమిత్ షా చిత్ర యూనిట్ ని ఆహ్వనించినట్లు చెబుతున్నారు.
కానీ సమయానికి చరణ్ అందుబాటులో లేకపోవడం.. రాజమౌళి ఇబ్బంది... ఇలా కొన్ని టెక్నికల్ రీజన్స్ తో తారక్ ఒక్కడే అందరి తరుపున బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా అమిత్ షా భేటితో తారక్ మరోసారి పాన్ ఇండియాలో వైరల్ అవుతున్నారు. బాలీవుడ్ మీడియాలోనూ యంగ్ టైగర్ హాట్ టాపిక్ మారుతున్నారు.
ఇక 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో తారక్ గోండు వీరుడు కొమరం భీమ్ పాత్ర పేరుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఆద్యంతం పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సాహసోపేతమైన పాత్రకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్ రిలీజ్ కన్నా నెట్ ప్లిక్స్ రిలీజ్ లో ఈ పాత్రకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో తారక్ ఫేమస్ అయ్యాడు. ఆ పాత్ర క్రేజ్ తో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కి నామినేట్ అవుతుందని ప్రచారం సాగుతోంది.