సీఎం మిసెస్.. బిగ్ బీతో సాంగేసుకుంది

Update: 2016-11-30 05:30 GMT
గ్లామర్ ఇండస్ట్రీలో ట్యాలెంట్ చూపించాలనే కోరిక చాలామందికే ఉంటుంది కానీ.. దాన్ని నెరవేర్చుకునే అవకాశం మాత్రం చాలా తక్కువ మందికే చిక్కుతుంది. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ భార్య అమృత.. ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనే సంగతి తెలిసిందే. సీఎం వైఫ్ అయినా సరే.. బ్యాంక్ ఉద్యోగం కంటిన్యూ చేస్తున్న ఈమె.. మధ్యమధ్యలో మరాఠీ.. బాలీవుడ్ సినిమాలకు పాటలు పాడేస్తోంది కూడా.

కునాల్ కోహ్లీ తీసిన ఫిర్ సే.. ప్రకాష్ ఝా మూవీ జై గంగాజల్ కోసం గాత్రదానం చేసిన అమృత.. ఇప్పుడు యాక్టింగ్ కూడా మొదలుపెట్టేసింది. అదికూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి డ్యాన్సులు వేసే రేంజ్ అన్నమాట. 'ఫిర్ సే' అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం షూటింగ్ చేయగా.. ఇందులో మిసెస్ ఫడ్నవీస్ గ్లామర్ రూపం చూపించడం విశేషం. మోకాళ్ల పైకి వేసిన రెడ్ కలర్ ఫ్రాక్‌.. హైహీల్స్ తో మెరిసిపోతోంది అమృత.

ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రాగా.. ఆ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపించనున్నారు. ఇద్దరి మధ్య సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుంది అని చెబుతున్నాడు దర్శకుడు అహ్మద్ ఖాన్. సీఎం భార్య ఇలాంటి గ్లామర్ రూపంలో బాలీవుడ్ గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెడుతుండడం ఆశ్చర్యకరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News